తెలంగాణ

ఏ లోటూ రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: వలస కార్మికులకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. అయితే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికుల యోగక్షేమాలను కేటీఆర్ స్వయంగా సోమవారం వివిధ కన్‌స్ట్రక్షన్ సైట్లకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. గచ్చిబౌలిలో ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో ఒడిస్సా, బెంగాల్, బిహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలతో మంత్రి మాట్లాడుతూ, కార్మికులకు సమకూర్చాల్సిన వసతి, సౌకర్యాలపై కాంట్రాక్టర్లను ఆదేశించినట్టు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పారిశుధ్యంతో పాటు ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించాలని సూచించారు. త్వరలోనే కరోనా మహమ్మారి తొలిగిపోతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అప్పటివరకు బయటకు వెళ్లవద్దన్నారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీల యాజమాన్యాలు ఆహారాన్ని, ఇతర వస్తువులను అందిస్తున్నారా? అని మంత్రి అడిగి కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని అన్నారు. ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందా? లేక సొంత ఊరికి వెళ్లాలని అనిపిస్తుందా? అని మంత్రి ప్రశ్నించగా, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కార్మికులు స్పష్టం చేశారు.

*చిత్రం...గచ్చిబౌలిలో వలస కార్మికుల క్యాంపును సందర్శించిన మంత్రి కేటీఆర్