తెలంగాణ

హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కువ కేసులు ఇక్కడి నుంచే..* నగరాన్ని జోన్లుగా విభజించి యూనిట్లుగా ఏర్పాటు*
కంటైనె్మంట్లలో పకడ్బందీ ఏర్పాట్లు* రాష్ట్ర సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలి*
ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్
*
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నగరంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నగరాన్ని జోన్ల వారీగా విభజించి ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యధిక జనసమమ్మర్ధం ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతిభవన్‌లో నగరంలోని సర్కిళ్ల వారీగా సమీక్షలు నిర్వహించి పరిస్థితికి తగ్గట్టుగా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇలాఉండగా సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ రాగా ఒకరు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎంకు వివరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని లేబరేటరీలను, ఆస్పత్రులను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఒక్కరోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా సోకే అవకాశం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉందని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని అనసరించాలని ఆదేశించారు. నగరంలో మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలని సూచించారు. ఒక్కో యూనిట్‌కు ప్రత్యేకంగా వైద్యాధికారి, పోలీస్ అధికారి, మున్సిపల్ అధికారి, రెవెన్యూ అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్ యంత్రాంగం అంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తానికి ఒక్క డీఎంహెచ్‌ఓ మాత్రమే ఉన్నారని, అయితే 17 సర్కిళ్లకు వేర్వేరుగా ఒక్కో సీనియర్ వైద్యాధికారిని నియమించాలని ఆదేశించారు. పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైనె్మంట్‌లు ఏర్పాటు చేయగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైనె్మంట్‌లు ఉన్నాయన్నారు. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ కంటైనె్మంట్లలోకి బయటి వారిని లోపలికి అనుమతించడం కానీ, లోపలి వారిని బయటికి అనుమతించడం కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ చేయవద్దని ఆదేశించారు. ప్రతీ కంటైనె్మంట్‌కు ప్రత్యేకంగా ఒక్కో పోలీస్ అధికారిని, నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. వీటిలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు.
*చిత్రం...మాస్క్ ధరించి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్