తెలంగాణ
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వికారాబాద్: అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప జనం బయటకు రావద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యవసర వస్తువులను ప్రజల ఇళ్ల వద్దకే పంపే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణను ఆదేశించారు.
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 25 చేరుకోగా, తొమ్మిది వార్డులను సీ జోన్లుగా ప్రకటించామని అన్నారు. ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మన్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, ఆర్‌డీఓ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.
*చిత్రం...కరోనాపై అధికారులకు సూచనలిస్తున్న మంత్రి సబితా రెడ్డి