తెలంగాణ

నిండుకుండలా శ్రీపాద ఎల్లంపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 23: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుకోవడం జలకళ సంతరించుకుంది. గత ఏడాది వర్షాకాలంలో కూడా ప్రాజెక్ట్‌లో ఇంత పెద్ద మొత్తంలో నీరు నిల్వ కాలేదు. ఈ వర్షాకాలం సీజన్‌లో శనివారం రాత్రి వరకు ప్రాజెక్ట్‌లో 11.38 శతకోటి ఘనటపు అడుగుల (టి ఎంసి)ల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎఫ్ ఆర్ ఎల్ 148 కాగా, ప్రస్తుతం వరద నీరంతా చేరకపోవడంతో 144.38 లెవెల్ వరకు ఉంది. 6400 క్యూసెక్స్‌ల నీరు ఇన్‌ఫ్లో అవుతుండగా 521 క్యూసెక్‌ల నీటిని ప్రాజెక్ట్ నుంచి వదిలిపెడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రామగుండం ఎన్టీపిసి థర్మల్ విద్యుత్ 366 క్యూసెక్స్‌ల నీటిని విడుదల చేస్తుండగా సుజల స్రవంతి పథకం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు రోజుకు 158 క్యూసెక్‌ల నీటిని పంపిణీ ద్వారా సరఫరా చేస్తున్నారు.

చిత్రం.. జలకళతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్