తెలంగాణ

ఎండిన మొక్క..మండిన హరీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 23: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి కరుణ, కరవు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదంటూ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోమారు ఫైర్ అయ్యారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా తన హ స్తాలతో నాటిన మొక్క ఆలనా పాలనకు నోచుకోకపోవడంతో ఆకులు రాలిపోయి వాడిపోయే దశకు చేరుకున్న దృశ్యం మంత్రి కళ్లారా వీక్షించి అసహనం, అసంతృప్తికి గురయ్యారు. గత యేడాది హరితహారం కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ, సింగూర్ కాలువల నీటి నిర్మాణం పనుల వద్ద మంత్రి మొక్కలు నాటారు. మొక్కలు బతికున్నా వాటికి రక్షణగా ట్రీగార్డులు ఏర్పాటు చేయడంలో అక్కడి అధికారులు నిర్లక్ష్యం చేసారు. తాజాగా శనివారం నాడు మంత్రి హరీష్‌రావు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌తో కలిసి మిషన్ భగీరథ పనులు, మంజీర ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి వచ్చారు. ఈ సందర్భంగా సాగునీటి పారుదల శాఖ అధికారులు మరోమారు మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. గతయేడాది నాటిన మొక్కకు సమీపంలోనే మొక్కను నాటిన మంత్రి ఆ మొక్క దీన పరిస్థితిని చూసి సంబంధిత ఎఇ క్రిష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే ఏడాది నాటికి మొక్కలు ఎదుగకుండా ఇలాగే ఉంటే ఇక్కడ పని చేయవంటూ గట్టిగా హెచ్చరించారు. కరవును నివారించాలంటే హరితహారం కార్యక్రమం విజయవంతం కావాలని, ఇందులో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
మొక్క నాటడం ఓ కళ
ఎమ్మెల్యే బాబుమోహన్ చలోక్తి
సింగూర్ ప్రాజెక్టు సమీపంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించడానికి మంత్రితో కలిసి పర్యటించిన అందోల్ ఎమ్మెల్యే తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. సింగూర్ ఎత్తిపోతల పథకం పంపింగ్ కేంద్రం వద్ద సాగునీటి పారుదల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నర్సరీ నుంచి తీసుకువచ్చిన మొక్కకు ఉండే ప్లాస్టిక్ కవరును తొలగిస్తూ గుంతలో నాటుతన్న క్రమంలో ఓ వ్యక్తి కొంత ఆలస్యంగా వ్యవహరించడంతో మొక్కను నాటడం అలాకాదండీ, మొక్కను నాటడం కూడా ఓ కళ అంటూ చమత్కరించి మంత్రి హరీష్‌తో పాటు అక్కడున్న వారిని నవ్వించడం గమనార్హం.

చిత్రం.. నిరాదరణకు గురైన మొక్కకు సమీపంలోనే
మరో మొక్కను నాటి నీరు పోస్తున్న మంత్రి హరీశ్, ఎమ్మెల్యే బాబుమోహన్