తెలంగాణ

సుప్రసన్న ‘సన్నుతి’ ఆవిష్కరణ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట (వరంగల్), జూలై 23: తెలంగాణ సాహితీ దిగ్గజం, తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేసిన కోవెల సుప్రసన్నాచార్యులు ఆశీతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ‘సన్నుతి’ అభినందన సం చికను ఆదివారం వరంగల్‌లో ఆవిష్కరిస్తున్నట్లు అభినందన సమితి సభ్యులు గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరానికి కీర్తి తెచ్చిన మహానుభావుడు కోవెల అని కొనియాడారు. జాతీయ గ్రంథాలయోద్యమం, ఆర్యసమాజం, తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమాలు, వందేమాతరం ఉద్యమాలు కోవెల వారి జీవితంపై ప్రభావం చూపాయని వివరించారు. సద్గురు శివానందమూర్తి సహచర్యంలో వారి బోధనలకు ప్రభావితులై, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన పథనిర్దేశనంలో తన జీవన గమనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. సాహిత్యంలో విమర్శ, పద్యం, గద్యం, కవిత్వం, వచనం వంటి ప్రక్రియల్లో సుప్రసన్న అనుసరించిన తీరు అనన్యసామాన్యమని అన్నారు. పరిశోధనా రంగం లో కూడా ఆయన నూతన ధృక్పథాలను కొలబద్దతలను ప్రవేశపెట్టారు. పోతన విజ్ఞాన పీఠానికి కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడమే కాకుండా, వివిధ భాషలలో పోతన భాగవతంపై వచ్చిన పుస్తకాలను సేకరించి భాగవత గ్రంథాలయాన్ని స్థాపించారని తెలి పారు. సుప్రసన్న ఆశీతి మహోత్సవ సంచిక ‘సన్నుతి’ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్‌లోని అశోక్ కాన్ఫరెన్స్ హాల్‌నందు ఆదివారం జరుగుతున్నదని, సాహితీ ప్రియులందరూ హాజ రుకావాలని సమితి సభ్యులు మిద్దెల రంగనాథ్, కుందావఝల కృష్ణమూర్తి కోరారు.

కోవెల సుప్రసన్నాచార్యులు (ఫైల్ ఫొటో)