తెలంగాణ

అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జూలై 23: పటన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై హెచ్‌ఎండిఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం పోలీసు బందోబస్త్తు మధ్య దాదాపు ఎనిమిది వెంచర్లపై దాడిచేశారు. హెచ్‌ఎండిఏ డిప్యూటీ కలెక్టర్ రాజేషం నేతృత్వంలో పలువురు హుడా అధికారులు అనుమతి లేని లేఅవుట్లపై విరుచుకుపడ్డారు. వాటికి సంబంధించిన ప్రహరీగోడలను, కమాన్‌లను కూలదోసి, స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. హెచ్‌ఎండిఏ డిప్యూటి కలెక్టర్ రాజేషం, హుడా టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర రావులు హెచ్‌ఎండిఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అక్రమంగా వెలసిన లేఅవుట్లపై దాడులు నిర్వహించారు. సుమారు 30 మంది పోలీసులతో పాటు రామచంద్రాపురం డివిజన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు సహకారంతో దాడులు జరిపారు. ఉదయమే అమీన్‌పూర్ గ్రా మ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న వారు ముందుగా గ్రామ శివారులలో ఉన్న ఆక్సిస్ పాప హోం వెంచరుపై దాడిచేశారు. దాని ప్రహరీగోడను కూలదోసి, లేఅవుట్ ప్రారంభంలో నిర్మించిన ఆర్చినీ పడగొట్టారు. దాని పక్కనే గల శంకర్‌హోంపై దాడి కొనసాగించిన వారు అనంతరం ప్రణీత్ పనోరమ పేరుతో నిర్మాణాలు కొనసాగుతున్న వెంచరుపై విరుచుకుపడ్డారు. రెండు జెసిబిలతో గంట పాటు శ్రమించి వెంచరు ముఖద్వారంలో అత్యాధునికంగా నిర్మించిన ఆర్చిని కూలదోయడానికి ప్రయత్నించారు. జెసిబిలతో ఆర్చి ని కూలదోయడానికి వీలుకాకపోవడం తో దానిపక్కనే ఉన్న ప్రహరీగోడను కూల్చారు. అక్కడి నుంచి బృందావన్ టీచర్స్ కాలనీకి చేరుకున్న హెచ్‌ఎండిఏ అధికారులు ప్రహరీగోడను కూల్చి సంబంధిత వెంచరు నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసారు. ఇకనైనా హుడా అనుమతి తీసుకున్న తర్వాతనే నిర్మాణాలను కొనసాగించాలని సూచించారు. లేని పక్షంలో చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఏ డిప్యూటీ కలెక్టర్ రాజేషం మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హుడా అనుమతి లేనిదే వెంచర్లు చేయడానికి వీలులేదని స్పష్టంచేశారు. మూడు మాసాల క్రితం వెంచర్ల యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కూల్చివేతకు దిగామన్నారు. అమీన్‌పూర్ గ్రామ పరిధిలో వెంచర్లకు అనుమతి ఇవ్వడానికి పంచాయతీ అధికారులకు అధికారం లేదన్నారు. పాత తేదీలతో వెంచర్లు చేసినట్లయితే సహించేది లేదని, వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శులు దేవదాసు, మధుసూధన్‌రెడ్డి, సత్యనారాయణ, డిఎల్‌పిఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

చిత్రాలు.. అమీన్‌పూర్ అక్రమ లేఅవుట్లను జెసిబిలతో కూల్చివేస్తున్న
హెచ్‌ఎండిఏ అధికారులు. కూల్చివేత సమయంలో గుమిగూడిన జనం