తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్‌కల్, నవంబర్ 29: బోరుబావిలో పడిపోయిన బాలుడు రాకేష్‌ను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన ఉదయం 6.30 గంటలకు చోటు చేసుకుంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ సాయంత్రం వరకు రాకపోవడం, జిల్లా ఎస్పీ అసలే పట్టించుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీవో, సిఐలు వారి పరిధిలో ఉన్న పరికరాలతో శ్రమించినా ఫలితం లేకపోయిందని, కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకుని ఉంటే హై పవర్ జెసిబిలు, ఇటాచీలను రప్పిస్తే బండరాళ్లను సైతం తొలగించి బాలుడిని కాపాడేవారన్న చర్చ కొనసాగుతుంది. వెల్దుర్తికి చెందిన శ్రీనివాస్ బాలుడిని బయటకు తీస్తానని చెప్పినా డివిజన్, మండల స్థాయి అధికారులు ధైర్యం చేయకపోవడంతో బాలుడిని కాపాడటంలో విఫలమయ్యారు. అభం శుభం ఎరుగని బాలుడిని బోరుబావి పొట్టన పెట్టుకుందని, నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని రాకేష్ బంధువులు బొమ్మారెడ్డిగూడెంలో ఆందోళనకు చేపట్టారు. పార్లమెంటు సభ్యులు బిబి పాటిల్, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌లు శనివారం సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆదుకుంటామని హామి ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందని బంధువులు అందోళన చేపట్టడంతో గ్రామ సర్పంచ్ శోభా జయరాం స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలకు ఉపక్రమించారు.
పరారీలో భూమి యజమాని
ఇంతటి ఘోరం జరుగుతుందని తాము కలలో కూడా ఊహించలేదని, బోరు బావిని తవ్విన గంట వ్యవధిలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తాముకు దిగ్భ్రాంతి చెందామని భూమి యజమాని కుమ్మరి రాములు భార్య లక్ష్మీ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయం సాగు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని బోరు వేస్తే అది విఫలమైందని, ఇంతలోనే బోరు మోటారుకు డబ్బులు చెల్లించడానికై ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికే రాకేష్ బావిలో పడిపోయాడన్నారు. తమలో కూడా మానవత్వం ఉందని, కొద్దిపాటి సమయం లభించినా గుంతను పూడ్చేవారమన్నారు. బోరు విఫలమైన అసంతృప్తితో ఉన్న తమకు రాకేష్ సంఘటన తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కేసులో ఇరుక్కున్న బోరు మోటర్ యజమాని
బోరు వేసిన వెంటనే భూమి యజమాని డబ్బులు ఇవ్వకపోగా, వెళ్లడానికి అవసరమైన డీజీల్ బోరులో లేకపోవడంతో బొమ్మారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న రాకేష్ సంఘటన కేసులో బోరు మోటారు యజమాని అడ్డంగా కేసులో ఇరుక్కుపోయాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు భూమి యజమానితో పాటుగా బోరు మోటారు యజమానిపై కేసు నమోదు చేయడం గమనార్హం. పుల్‌కల్, రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరంపేట, అందోల్ తదితర మండలాల్లో బోర్లను డ్రిల్ చేయడానికి జోగిపేట నుంచి వాహనాలను తీసుకువెళతారు. బొమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి రాములు నర్సాపూర్ నుంచి బోరు మోటారును తీసుకురావడం గమనార్హం. కారణమేదైనా కేసులో ఇరుక్కుపోవడం బోరు మోటారు యజమాని వంతైంది.

బొమ్మారెడ్డిగూడెంలో బోరుబావి వద్ద గుంత తవ్వుతున్న జెసిబి