తెలంగాణ

సంబురాలు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయు) స్థాపించి వందేళ్లు పూర్తయన సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. శతాబ్థి ఉత్సవాల నిర్వహణకు ఇప్పటినుంచి సన్నద్ధం కావాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాద్ధి ఉత్సవాలపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగశర్మ, ఎంపి కేశవరావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో ముఖ్యమంత్రి చర్చించారు. ఉస్మానియా యూన్సివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని సిఎం సూచించారు. ఓయు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించిందని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో దేశ, విదేశాల్లో చాలా రంగాల్లో రాణించారన్నారు. ఓయు నుంచి పట్టా పొందడాన్ని ఎంతో గొప్పతనంగా, ప్రత్యేకమైందిగా భావించే వారని, తమ నేమ్ ప్లేట్లలో విద్యార్హతల పక్కన ఓయులో చదివినట్టుగా (ఒఎస్‌ఎం) అని పెట్టుకునేవారని సిఎం గుర్తు చేశారు. శతాబ్ధి ఉత్సవాలను ఏవిధంగా నిర్వహిస్తే బాగుంటుందో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశించారు. త్వరలోనే ఓయుకు పూర్తి స్థాయి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించనున్నట్టు సిఎం చెప్పారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి ఎంపి కేశవరావు వంటి అనుభవజ్ఞులు, యూనివర్సిటీతో అనుబంధం కలిగిన వారితో సలహా మండలి ఏర్పాటు చేసి వారి నుంచి శతాబ్ధి ఉత్సవాలపై చర్చించాలన్నారు. ఇక్కడ చదువుకుని విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులతో ఎన్‌ఆర్‌ఐ సదస్సు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
నకిలీ సర్ట్ఫికేట్లు, పేపర్ లీకేజిలపై కఠినంగా వ్యవహరించాలి
విద్యా వ్యవస్థను బలహీన పర్చే విధంగా, అలాగకే అపహాస్యం చేసే శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని డిజిపి అనురాగశర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజిలకు, ఫేక్ సర్ట్ఫికేట్లకు స్థానం లేదని ముఖ్యమంత్రి అన్నారు. తప్పుడు పద్ధతులు అవలంభించే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ పొరపాటు జరగడానికి అవకాశం ఉందో గమనించి నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం... ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సిఎం కెసిఆర్ దంపతులు