తెలంగాణ

ఏపిలో పుష్కరాల్లో వైద్య సిబ్బందికి డ్రెస్‌కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 25: పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన వైద్య పరికరాలతో పాటు మొబైల్ బృందాలు, అంబులెన్స్ సౌకర్యం, ఘాట్లలో భక్తులకు సూచనలను చేసే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. వైద్య సిబ్బందికి బ్లూస్కర్టు, వైట్ స్కార్ప్‌తో ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐఎంఎ వాళ్లు కూడా ప్రత్యేకంగా పుష్కర భక్తులకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. పుష్కరాల్లో పాల్గొనే ఉద్యోగులకు నగరంలో 600 స్కూళ్లు, 78 కాలేజీల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో ఏర్పాటుచేసే వైద్య శిబిరాల్లో పాల్గొనే డాక్టర్లకు కూడా వసతి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. మంత్రి సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.