తెలంగాణ

పనుల్లో వేగం.. నాణ్యత పూజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 25: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23 వరకు జరుగనున్న కృష్ణా నది పుష్కరాల సందర్భంగా నది పరీవాహకం వెంట ఉన్న ప్రసిద్ధ ఆలయాలకు పుష్కర హంగులద్దాలన్న సర్కార్ యోచన సకాలంలో సిద్ధించడం కష్టతరంగా కనిపిస్తోంది. కృష్ణా పుష్కర స్నానాల అనంతరం భక్తులు దగ్గర్లో ఉన్న దేవాలయాలను దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతాల్లోని 33 ఆలయాల అభివృద్ధికి, భక్తుల వసతి కల్పనకు ప్రభుత్వం దేవాదాయ శాఖకు 2.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్లు ఖరారు చేసుకుని పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రస్తుతం ఆలయాల మరమ్మతులు 50 శాతం స్థాయిలోనే ఉన్నాయి. దీంతో ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా కనిపించడం లేదు. ఆలయాలకు వచ్చివెళ్లే దారుల్లో సిమెంట్ పనులు, మండపాలు, ముఖద్వారాల నిర్మాణాలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపకాంతుల అలంకరణ, రంగులు మంచినీటి వసతి వంటి పనులలో ప్రధానంగా సిమెంట్ వర్క్స్, రంగుల పనులు సాగుతున్నాయి. నాసిరకం పనులు చేస్తున్నారంటూ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.
దామరచర్ల మండలం వాడపల్లి మీనాక్షిఅగస్తేశ్వర దేవాలయానికి 27 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టగా మండపం స్లాబ్ పూర్తవ్వగా ఇతర పనులు ప్రారంభం కాలేదు. ఉత్తర, దక్షిణ ద్వారాల పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఉన్న పంచనరసింహ క్షేత్రాల్లోని లక్ష్మినరసింహ ఆలయం ముస్తాబుకు 15 లక్షలు, అయ్యప్ప ఆలయానికి లక్ష, అడవిదేవులపల్లి బౌద్దగుళ్ల మరమ్మతులకు 17 లక్షలు, ముదిమాణిక్యం రామాలయం-శివాలయానికి 6 లక్షలు, ఇర్కిగూడెం పార్వతి అమ్మవారి గుడికి 8 లక్షలు మంజూరు చేశారు. వాటి పనులన్ని కూడా నేటికీ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి.
నాగార్జునసాగర్ ఘాట్‌ల వద్ద ఉన్న సత్యనారాయణస్వామి, పైలాన్ శివాలయం, మార్కెండేయ ఆలయం ఏలేశ్వర మాధవస్వామి, గణపతి, డౌన్‌పార్కు ముత్యాలమ్మ, ఉట్లపల్లి రామాలయం, చింతలపాలెం శివాలయంల మరమ్మతులకు 31.1 లక్షల నిధులు మంజూరు చేశారు. సిమెంట్ పనులు, ఆలయాలకు రంగులు వేయడం, విద్యుత్ దీపాల కనెక్షన్స్ వంటి పనులు 45 శాతం మేరకు జరిగాయి. పెద్దఅడిశర్లపల్లి అజ్మాపూర్ ఘాట్ శివాలయానికి 3 లక్షలతో చేపట్టిన పనులు పిల్లర్ల స్థాయిలో, కనగల్ ఘాట్ తిరుమలనాథస్వామి ఆలయ పునరుద్ధరణకు 5 లక్షల పనులు గోడల స్థాయిలో ఉన్నాయి. పిఏపల్లి కోదండరామాలయం మరమ్మతులను విస్మరించడం విమర్శలకు తావిచ్చింది. చందంపేట మండలం పెద్దమునిగాల ఘాట్ సమీపంలోని అంబాభవాని ఆలయానికి 2.78 లక్షల మరమ్మతు పనుల్లో ప్రహరీ నిర్మాణం చేయగా ఇతర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కాచరాజుపల్లి ఘాట్ ఆలయానికి 2.41 లక్షలతో చేపట్టిన మరమ్మతుల పనులు ఇంకా మొదలుకాలేదు.
మఠంపల్లి లక్ష్మినరసింహస్వామి దేవాలయం మరమ్మతు పనులు 30 లక్షలతో చేపట్టగా ఇక్కడ మాత్రం 70 శాతానికి పైగా జరిగాయి. ముఖమండపం నిర్మాణ పనులు తుది దశకు చేరగా, క్యూలైన్లు, విద్యుత్, చలువ పందిళ్ల ఏర్పాటు, రంగుల పనులు కొనసాగుతున్నాయి. మేళ్లచెర్వు మండలం వజినేపల్లి రాజ్యలక్ష్మి అమ్మవారు, కిష్టాపురం అంజనేయస్వామి ఆలయ మరమ్మతులు 2 లక్షలతో చేపట్టారు. రంగులు వేయగా సిసి రోడ్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు పనులు జరుగాల్సివుంది. నేరడుచర్ల మహంకాళిఘాట్ అంజనేయస్వామి ఆలయం మరమ్మతులకు 3 లక్షలతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. నల్లగొండ పట్టణంలోని ఛాయ సోమేశ్వర ఆలయానికి 3 లక్షలు పనుల్లో ప్రస్తుతం ఆలయం పుష్కరణి నిర్మాణం, సిసి రోడ్ల పనులు సాగుతున్నాయి. పురావస్తుశాఖ పరిధిలో ఆలయం ఉండటంతో రంగులు వేయడంలేదు.
పచ్చల సోమేశ్వర ఆలయానికి 5 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనుల్లో రంగుల పనులు సాగుతుండగా చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు, ఆలయంలోపల మరమ్మతు పనులు చేపట్టాల్సివుంది. మొత్తంగా జిల్లాలోని కృష్ణా పుష్కర ఘాట్‌ల సమీపంలో ఉన్న ఆలయాల మరమ్మతులు పుష్కరాల ప్రారంభంకల్లా కూడా కొనసాగనున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులు పనుల వేగం పెంచేందుకు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆలయాల్లో వసతుల కల్పనతో పాటు పిండప్రధానాలకు స్థల నిర్మాణాలు, మహిళలకు డ్రెస్సింగ్ రూమ్స్ వంటి పనులు సైతం ఆరంభ దశలో ఉన్న తీరు జిల్లాలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో సాగుతున్న జాప్యానికి అద్దం పడుతున్నాయి. పుష్కరాల వేళ భక్తుల పూజాదికాల కోసం పూజారుల ఏర్పాటుకు దేవాదాయ శాఖ ఆలస్యంగానైనా దరఖాస్తుల స్వీకరణ చేపట్టి ఘాట్‌ల వారిగా నియామకాలు, గుర్తింపుకార్డుల జారీ ప్రక్రియను చేట్టింది.

చిత్రాలు..నాగార్జునసాగర్ శివాలయం వద్ద జరుగుతున్న సిమెంట్-కాంక్రీట్ పనులు * పిఏపల్లి అజ్మాపురం ఘాట్ వద్ద శివాలయం అసంపూర్తి పనులు