తెలంగాణ

గ్రూప్-2కి మళ్లీ నోటిఫికేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) గతంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను తాజాగా మళ్లీ జారీ చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో 434 పోస్టుల భర్తీ చేయనున్నట్టు టిఎస్‌పిఎస్‌సి పేర్కొంది. అయితే గ్రూప్-2 కేడర్‌కు మరో 593 పోస్టుల మంజురుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న 434 పోస్టులు, తాజాగా మంజూరు చేసిన 593 పోస్టులు కలిపి తాజాగా 1027 పోస్టులకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేయాలని టిఎస్‌పిఎస్‌సి యోచిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.