తెలంగాణ

ఇక సమస్యలుండవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: విదేశాలకు వెళ్లే వారి సమస్యల పరిష్కారానికి ‘ప్రవాసీ తెలంగాణ దివాస్’ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. కేరళ, పంజాబ్ కంటే మెరుగైన ఏన్నారై పాలసీని తీసుకోస్తామన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో బుధవారం ఎన్నారైలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, విదేశాలలో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్తున్న వారిలో 10 శాతం మంది అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారన్నారు. ఎన్నారైల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 24 గంటలు పని చేసే విధంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లే సమాచారాన్ని నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి అక్కడి చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. విదేశాలలో బ్లాక్ లిస్టులో పెట్టిన కాలేజీల వివరాలను రాష్ట్రంలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక నుంచి విదేశాలకు వెళ్లే వారికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడి వెనక్కి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ చేస్తామన్నారు. అలాగే అక్కడ ప్రమాదవశత్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు ఏక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. ఎన్నారైల కోసం తీసుకువచ్చే విధానంలో ఇక్కడ చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు.