తెలంగాణ

టి.ఎమ్సెట్-1 కూడా లీక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ఎమ్సెట్-1 కూడా లీకైందా? ఎమ్సెట్-2లో నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్న రాజ్‌గోపాల్ రెడ్డిని సిఐడి పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం బహిర్గతమైనట్లు తెలిసింది. ఇదే నిజమైతే సిఐడి దర్యాప్తు మరికొన్నిరోజులు సాగే అవకాశం ఉంది. సిఐడి పోలీసులు ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతిష్టాకరమైన తెలంగాణ ఎమ్సెట్-2 ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పిజిమెట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
2014లో పిజి వైద్యకోర్సుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైంది. రెండేళ్ల క్రితం కూడా ఆయనను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసులో సిఐడి పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సిఐడి పోలీసులు ఈ కేసు దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. గురువారం అధికారికంగా సిఐడి పోలీసులు ఈ కేసు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సిఐడి అధికారులు గతంలో ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షల పేపర్లను లీక్ చేసి అరెస్టయిన వారి వివరాలను సేకరించారు. వారి కాల్ డేటాను తీసుకున్నారు.
అలాగే ఎమ్సెట్-2లో ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సీటు గ్యారంటీగా వచ్చిన వారి ర్యాంకులను విశే్లషించారు. ఇందులో తెలంగాణ ఎమ్సెట్-1, ఆంధ్ర ఎమ్సెట్ పరీక్షను రాసినప్పుడు వారి ర్యాంకుల వివరాలను సేకరించారు. ఎమ్సెట్-2లో మంచి ర్యాంకులు పొందిన అనుమానిత విద్యార్థుల తల్లిదండ్రుల కాల్ డేటాను కూడా సేకరించారు. సిఐడి దర్యాప్తులో ఒక ప్రొఫెసర్, ఒక బోధనేతర ఉద్యోగి ఉన్నట్లు నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఎమ్సెట్-2 లీకేజిని బహిర్గతం చేసిన సతీశ్ అనే వ్యక్తి మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు సరిగా చదవకపోయినా మంచి ర్యాంకులు వచ్చిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు. ఏపి ఎమ్సెట్, టిఎస్ ఎమ్సెట్-1లో తక్కువ ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఎమ్సెట్-2లో వెయ్యి లోపు ర్యాంకులు వచ్చాయి.
తన కుమార్తెతో పాటు 11 మంది విద్యార్థులు వరంగల్ నుంచి విజయవాడకు కోచింగ్‌కు వెళ్లారని, ప్రిపరేటరీ పరీక్షల్లో అంతంత మాత్రం మార్కులు వచ్చిన విద్యార్థులకు ఎమ్సెట్-2లో మంచి ర్యాంకులు రావడం అనుమానం కలిగించినట్లు చెప్పారు. ఏపి ఎమ్సెట్‌లో 25వేల ర్యాంకు వచ్చిన వారికి తెలంగాణ ఎమ్సెట్-2లో టాప్ ర్యాంకు ఎలా వస్తుందన్నారు. ఎమ్సెట్-2 పరీక్షకు వారం రోజుల ముందే ఈ విద్యార్థులు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోవడం, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కాకపోవడం అనుమానం కలిగించిందన్నారు. తన కుమార్తెకు ఏపి ఎమ్సెట్‌లో 13వేల ర్యాంకు, తెలంగాణ ఎమ్సెట్-1లో 7వేల ర్యాంకు వచ్చిందని, అదే ఎమ్సెట్-2లో 9వేల ర్యాంకు వచ్చిందన్నారు.