తెలంగాణ

దాడిచేసిన వారిని శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: భీమా ప్రాజెక్టు ట్రయల్ నిర్వహించడానికి వెళ్లిన ఇంజనీరింగ్ అధికారులపై దాడి చేసిన టిడిపి, బిజెపి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జలసౌధ ఎదుట టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సహా టిఎన్‌జివో నేతలు, తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు బుధవారం ధర్నా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భీమా ఎత్తిపోతలకు మంగళవారం ట్రయల్ నిర్వహించడానికి వెళ్లిన ఆ ప్రాజెక్టు ఎస్‌ఇ, ఇఇ, డిఇ తదితర ఇంజనీరింగ్ అధికారులపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక నేతలు దాడి చేశారని వారు ఆరోపించారు. బంగారు తెలంగాణ సాధన కోసం తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చివరకు అధికారులపై కూడా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇలా ఉండగా ఇంజనీరింగ్ అధికారులపై దాడికి నిరసనగా జరిగిన ధర్నాకు జలసౌధలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టిఎన్‌జివోల సంఘం గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు శ్రీ్ధర్ దేశ్‌పాండే, టి వెంకటేశం తదితరులు డిజిపి అనురాగ శర్మను కలిసి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని వినతి పత్రం సమర్పించారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఐదుగురిని అరెస్టు చేశాం: డిజిపి
మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ వద్ద మంగళవారం ఇంజనీరింగ్ అధికారులపై దాడి చేసిన ఐదుగురిని వెంటనే గుర్తించి అరెస్టు చేసినట్టు డిజిపి అనురాగ్ శర్మ ఈ సందర్భంగా తెలిపారు. దాడికి పాల్పడిన మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు డిజిపి తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్టవ్య్రాప్తంగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ప్రతినిధి బృందానికి డిజిపి అనురాగ్‌శర్మ వివరించారు.
బాహ్మణ వృద్ధులు,
వితంతువులకు పింఛన్లు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 27: ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన 6,500 మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడానికి సిఎం నిర్ణయించారు. కశ్యప ఆహార-ఆవాస పథకం కింద ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు అందచేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది.
విద్యామండలి ఆస్తుల
పంపకానికి కమిటీ
రాజ్యసభలో కేంద్రం వెల్లడి
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 27: ఉన్నత విద్యామండలి ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య పంపకం చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం తెలిపింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి అధ్వర్యంలో ఏర్పడే ఈ కమిటీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు ఉంటారని, కమిటీ చర్చించిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అయితే ఈ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించలేదని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నదని ప్రశ్నించారు.

శ్రీవారి హుండీలో చోరీ
తిరుమల, జూలై 27: తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రధాన హుండీలో సోమవారం మధ్యాహ్నం రూ.50వేలు చోరీచేస్తున్న ఓ పాత నేరస్తుడ్ని టిటిడి సిబ్బంది పట్టుకున్నారు. విచారణ అనంతరం క్రైమ్ ఎస్ ఐ ఈశ్వరయ్య విలేఖరుల సమావేశంలో నిందితుడ్ని ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో శ్రీవారి హుండీలో ఓ భక్తుడు రూ.50వేల రూపాయల బండిల్‌ను కానుకగా సమర్పిస్తున్న సమయంలో పాత నేరస్తుడు అర్జున్ (24) హుండీకి మరోవైపునుంచి హుండీలో కానుకలు సమర్పిస్తున్నట్లు చేతులుపెట్టాడు. రూ.50వేల రూపాయల బండిల్ హుండీలో పడకముందే తన చేతులతో పట్టుకున్నాడు. హుండీ వద్ద టిటిడి ఏర్పాటుచేసిన సిసి టివిల ద్వారా ఈ దృశ్యాలను పర్యవేక్షిస్తున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై ఆలయం బయటకు వెళ్లిపోవడానికి సిద్ధపడిన అర్జున్‌ను హుండీ వద్దనే విజిలెన్స్ ఎవి ఎస్ ఓ మల్లికార్జున్ పట్టుకుని క్రైం పోలీసులకు అప్పగించారు. ఈశ్వరయ్య అతన్ని విచారించి అతని వద్ద ఉన్న రూ.50,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో శ్రీవారి ప్రధానహుండీలో ఇదే తరహాలో రూ.10వేలు చోరీచేస్తూ పట్టుబడి శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. కాగా అర్జున్‌పై క్రైం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.