తెలంగాణ

విధుల బహిష్కరణలో ఇంజనీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28:్భమా ప్రాజెక్టు ట్రయల్ రన్ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులపై దాడులు జరిపిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఇంజనీర్స్ జెఎసి ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం రోజున జరిగే నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టు జెఎసి ప్రకటించింది. మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, భీమా సూపరింటెండెంట్ భద్రయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ శంకర్‌పై భీమా ట్రయల్ రన్ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న కొందరు తమను ఎందుకు పిలవలేదంటూ దుర్భాషలాడి, దాడి చేశారని జెఎసి తెలిపింది. దాడి చేసిన వారు ఏపార్టీకి చెందిన వారైనా చర్య తీసుకోవాలని జెఎసి ఆందోళనకు దిగినట్టు చెప్పారు. చట్టపరంగా చర్య తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చిన తరువాత దుండగులను నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బుధవారం అరెస్టయిన నలుగురు వెంటనే కోర్టు బెయిల్ పొంది దర్జాగా ఇంటికి వెళ్లారని తెలిపారు. దాడులు జరిపిన వారు సగర్వంగా గల్లాలు ఎగరేసుకుని తిరుగుతుండడం ఇంజనీర్ల ఆత్మగౌరవానికి తీవ్ర విఘాతం జరిగినట్టు భావిస్తున్నామని జెఎసి తెలిపింది. గురువారం ఇంజనీర్ల జెఎసి కార్యవర్గసమావేశం నిర్వహించి నిందితులను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ బహిష్కరించి, శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని జెఎసి ప్రకటించింది. ఇంజనీర్ల జెఎసి చైర్మన్ టి వెంకటేశం, కిషన్, మహేందర్, చక్రధర్, శ్రీనివాసరెడ్డి, రవీందర్‌రెడ్డి, పుల్లారావు, ఎల్లారెడ్డి తెలిపారు. మొత్తం 18 శాఖల ఇంజనీర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు.