తెలంగాణ

ఆయకట్టు రైతుల్లో రేకెత్తిన ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 30: తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల నుండి తీవ్ర వర్షాభావం వల్ల నీటి నిల్వలను సంతరించుకోలేకపోయిన ఎస్సారెస్పీలోకి, ఈ ఏడాది సీజన్ ఆరంభం నుండే వరద జలాల చేరిక ప్రారంభమై ప్రాజెక్టు నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువన గల మహారాష్టల్రో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి విష్ణుపురి, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులతో పాటు ఇతర రిజర్వాయర్ల నుండి మిగులు జలాలు దిగువ గోదావరి ద్వారా ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతున్నాయి. 1091.00 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన శ్రీరాంసాగర్‌లో శనివారం సాయంత్రం నాటికి నీటిమట్టం 1073.90అడుగులు, 37టిఎంసిలకు చేరుకుంది. ప్రస్తుతం 35,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందని, ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురియకపోయినా ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహం మరో 48గంటల వరకు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అంటే రిజర్వాయర్‌లో నీటిమట్టం 40టిఎంసిల వరకు పెరగడం ఖాయమని స్పష్టమవుతోంది. వర్షాకాలం సీజన్ మరో రెండు మాసాల కాలం మిగిలి ఉండడం, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంటుండడంతో ఈసారి వర్షాకాలం సీజన్ చివరి నాటికైనా ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుంటుందని అధికారులు, ఆయకట్టు రైతులు ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. ఈ సీజన్‌లో జూన్ మొదటి వారం నుండి ఇప్పటివరకు 32టిఎంసిల వరద నీరు వచ్చి చేరడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎంతగానో మెరుగుపడ్డాయని తెలుస్తోంది. గతేడాది ఇదే సమయానికి రిజర్వాయర్‌లో కేవలం 1051.90 అడుగులు, 7.24టిఎంసిల వరకు మాత్రమే నీరు నిలువ ఉండింది. అయితే గత మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే మాత్రం ఎస్సారెస్పీ పరిస్థితి ఇప్పుడు కూడా దిగదుడుపుగానే కనిపిస్తుంది. 2013లో జూలై రెండవ వారం నాటికే ఎస్సారెస్పీకి వరద జలాలు పోటెత్తుతూ పూర్తి స్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోగా, సు మారు 120టిఎంసిల వరకు మిగులు జలాలను వృధాగా వదిలి పెట్టారు. ఫలితంగా 2013లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లోనూ ఆయకట్టు రైతాంగానికి సమృద్ధిని నీటిని అందించగలిగారు. అనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రిజర్వాయర్ వట్టిపోవడంతో గడిచిన రెండేళ్లుగా సాగు జలాల కోసం రైతులు పరితపించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు వానలు అనుకూలిస్తూ ఈ ఏడాది ఒకింత ఆశావహ పరిస్థితులు నెలకొనడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వాయర్ ద్వారా సాగు జలాలు ఎలాగూ అందుతాయనే గట్టి నమ్మకంతో ఖరీఫ్ సాగు చేపట్టేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలోని సుమారు 6లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అనువైన పరిస్థితి ఏర్పడుతోంది. ఖరీఫ్ సీజన్‌లో చివరి సమయం వరకు పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ద్వారా నీటిని అందించాలంటే రిజర్వాయర్‌లో కనీసం 60 టిఎంసిల వరకు నీటి నిల్వలు అవసరం అవుతాయి. ప్రస్తు తం 40టిఎంసిలకు నీటిమట్టం చేరువ కావడంతో వర్షాకాలం సీజన్ ముగిసేంత వరకు మరో 20టిఎంసిల నీరు వచ్చి చేరుతుందని, ఒకవేళ కొంత తక్కువగా వచ్చినా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో కనీసం రెండు తడులైనా నీటిని విడుదల చేస్తారనే అంచనాతో ఆయకట్టు రైతులు పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంటల సాగు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

చిత్రం.. నీటితో కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు