తెలంగాణ

అక్రమ మైనింగ్‌పై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1:అక్రమ మైనింగ్‌ను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మిక తనిఖీలు జరపనున్నట్టు ఐటి, మైనింగ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కరీంనగర్ పర్యటనలో ఉన్న కెటిఆర్ జిల్లా యంత్రాంగానికి, స్థానిక గనుల శాఖ యంత్రాంగానికి ఎలాంటి సమాచారం లేకుండా కొత్తపల్లి ఇసుక రీచ్‌ను సందర్శించారు. స్థానిక ఎస్‌ఐ మినహా అధికారులెవరూ లేరు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇసుక రవాణాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని చెప్పారు. రాజీవ్ రహదారికి మూడు కిలో మీటర్ల దూరంలోని కరీంనగర్ జిల్లా కొత్త పల్లిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న మోయతుమ్మెద వాగులో మైనింగ్‌ను పరిశీలించారు. అధికార వాహనాన్ని వదిలి, స్థానిక పోలీసు వాహనంలో మంత్రి ఒక్కరే ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. వాగులో ఉన్న కూలీలతో మాట్లాడారు. వాగుతో పాటు కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన డంప్ సైట్లను మంత్రి పరిశీలించారు. వీటన్నింటినీ సీజ్ చేసి అమ్మకం చేయాలని మంత్రి ఆదేశించారు. అక్రమ రవాణా అరికట్టేందుకు మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో టీంలను ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. భారీ ఎత్తున అక్రమ రవాణాను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ మోడల్ తనిఖీలు అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామని చెప్పారు. ఈ బృందాలను రోటేషన్ ప్రకారం నిర్ణీత కాలం తర్వాత మార్చాలని కెటిఆర్ సూచించారు. స్థానిక అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్ల యంత్రాంగం సరైన అనుమతులు ఇచ్చే విధానం ఉండాలని సూచించారు. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చిత్రం.. ఇసుక రీచ్‌లను తనిఖీ చేస్తున్న మంత్రి కెటిఆర్