తెలంగాణ

మావోయిస్టు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 1: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మావోయిస్టు పార్టీ దళసభ్యుడు టేకం రవి ఆలియాస్ రవీందర్‌ను సోమవారం తాండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన టేకం రవిని సోమవారం జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఖానాపూర్ మండలం బిమండి గ్రామానికి చెందిన టేకం రవి అడవిలో కలపసేకరణకు వెళ్తుండగా రెండేళ్ల కిందట చుంచు బక్కన్న అనే దళ సభ్యునితో పరిచయమై మావోయిస్టు పార్టీలో చేరిపోయాడని ఎస్పీ తెలిపారు. 2015 అక్టోబర్ 30న తిర్యాణి మండలం కైరిగూడ వద్ద కుర్సెంగె బల్లార్ష అనే గిరిజనున్ని పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపిన సంఘటనలో టేకం రవి నిందితుడని, అదే ప్రాంతంలో మావోయిస్టు ప్లీనరీకి కూలీలను సమీకరించి సమావేశం నిర్వహించడంలో రవి ప్రధాన పాత్ర పోషించినట్లు ఎస్పీ తెలిపారు. రెండు నెలల కిందట ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా టేకం రవి తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. మావోయిస్టు ఉద్యమం రోజు రోజుకు బలహీన పడుతోందని, అడవిలో ఆయుధాలు పట్టుకొని సాధించేది ఏమి లేదని, ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు.