తెలంగాణ

కార్తీక రామ పునర్వసు దీక్షలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 29: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కార్తీక రామ పునర్వసు దీక్షలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రుని మంటపంలో భక్తుల రామనామ సంకీర్తన నడుమ శ్రీ సీతారామచంద్రస్వామి అలంకారమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రామ పాదుకలకు పూజలు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిపాక పుణ్యజలాలను శ్రీరామ దీక్షాపరులపై చల్లారు. తులసి పూజ చేసి రామ మాలలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్బార్ సేవ అనంతరం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఊరేగింపుగా గోదావరి ఒడ్డున పునర్వసు మండపానికి వెళ్లి పూజలందుకున్నారు. అనంతరం మాడవీధుల గుండా స్వామి తిరువీధి సేవకు గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు.

శ్రీరామ మాల స్వీకరిస్తున్న భక్తులు

మావోయిస్టుల పేరుతో లూటీ

భద్రాచలం, నవంబర్ 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టుల పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ 30 జాతీయ రహదారిపై కుంట వద్ద స్వైరవిహారం చేశారు. హైదరాబాద్-జగ్దల్‌పూర్ బస్సును కుంటకు 6కి.మీ దూరంలోని ఆసిల్‌గూడ వద్ద అటకాయించి ప్రయాణికుల నుంచి రూ.70 వేల నగదు, బంగారం, ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇక్కడే మరో బస్సు, లారీలను సైతం అటకాయించి డబ్బులు దోచుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పి దుండగులు ఈ దురాగతానికి పాల్పడటం విశేషం. నెల రోజుల క్రితం తోంగుపాల్ వద్ద ఇదే తరహాలో బస్సును అటకాయించి బాలుడి వైద్యం కోసం వెళ్తున్న కుటుంబీకుల నుంచి రూ.35వేలను దోచుకున్న ఘటన మరువక ముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.