తెలంగాణ

మరో మార్గం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత్యంతరం లేకనే ఎమ్సెట్-2 రద్దు ఎమ్సెట్-3 నిర్వహణ బాధాకరమే సహృదయంతో సహకరించండి
లీక్ జరిగితే తప్పని అవస్థ ఇది పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పని లేదు కేంద్రాలకు ఉచిత ప్రయాణం
ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్ రెడీ జెఎన్‌టియుకే పరీక్ష నిర్వహణ బాధ్యత మరోసారి ఎమ్సెట్‌పై సిఎం కెసిఆర్

ఏ పరీక్షకైనా ప్రశ్నపత్రం లీకైతే మళ్లీ నిర్వహించడం తప్ప మరో మార్గం లేదు. ఎమ్సెట్-2కీ అలాంటి అవస్థ తప్పలేదు. ఇది అత్యంత బాధాకరం, దురదృష్టకరం. గత్యంతరంలేని పరిస్థితుల్లోనే తిరిగి ఎమ్సెట్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. పరీక్షకు సన్నద్ధం కండి.
-సిఎం కెసిఆర్

హైదరాబాద్, ఆగస్టు 2: ‘ఎమ్సెట్ ప్రశ్నపత్రం లీక్ కావడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. గత్యంతరంలేని పరిస్థితుల్లోనే తిరిగి ఎమ్సెట్ నిర్వహించక తప్పటం లేదు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. విద్యార్థులతో మరోసారి పరీక్ష రాయించటం బాధకరమే అయినప్పటికీ పరిస్థితిని సహృదయంతో అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70 సందర్భాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అన్ని సందర్భాల్లోనూ తిరిగి పరీక్షలు నిర్వహించిన గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్సెట్ తిరిగి నిర్వహించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్సెట్ ప్రశ్నపత్రాలు లీక్‌పై మంగళవారం ఉన్నత విద్య, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డితోపాటు ఉన్నత విద్యామండలి, జెఎన్‌టియు, సిఐడి, ఇంటెలిజెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్సెట్ పత్రాల లీక్‌పై సిఐడి అందించిన నివేదిక, తిరిగి పరీక్ష నిర్వహణకు జెఎన్‌టియు తయారు చేసిన షెడ్యూల్‌పై సిఎం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తిరిగి ఎమ్సెట్ నిర్వహణకు ఆదేశిస్తూ ఎమ్సెట్-3 షెడ్యూల్ విడుదల చేయాలని ఆదేశించారు. ఎమ్సెట్-3 నిర్వహణ బాధ్యతను ఎప్పటి మాదిరిగానే జెఎన్‌టియుకు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. అయితే పరీక్ష నిర్వహణకు కొత్త కన్వీనర్, కో-కన్వీనర్‌ను నియమించాల్సిందిగా ఆదేశించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లూ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. పాత హాల్ టికెట్లనే తిరిగి నిర్వహించే పరీక్షకు అనుమతించాలని సూచించారు. ఎమ్సెట్-2 రాసిన విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా అవకాశం కల్పించాలని ఆదేశించారు. అలాగే పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జెఎన్‌టియు వెబ్‌సైట్‌లో స్టడీ మెటిరియల్‌ను అందుబాటులో ఉంచాలని, విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా సకాలంలో ఎమ్సెట్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీకేజీతో తిరిగి పరీక్ష నిర్వహించడం వినా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, జరగకూడనిది జరిగినప్పుడు కొంతమందికి ఇబ్బంది తప్పదని, ఆందోళన చెందకుండా తమ పిల్లలను తల్లిదండ్రులు పరీక్షకు సిద్ధం చేయాలని కెసిఆర్ కోరారు.

చిత్రం... ఎమ్సెట్-3 నిర్వహణపై ఉన్నతస్థాయ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్