తెలంగాణ

దర్యాప్తును పర్యవేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: తెలంగాణ ఎమ్సెట్-2 ప్రశ్నాపత్రం లీకేజిపై దర్యాప్తు చేస్తున్న సిఐడి తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకైనందువల్ల తాజాగా నోటిఫికేషన్‌ను ఆదేశించాలని, సిఐడి దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ ఎస్ మహేందర్ రాజు అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ మాట్లాడుతూ అసాధారణ పరిస్ధితుల్లోనే హైకోర్టు ఒక ఏజన్సీ దర్యాప్తును పర్యవేక్షిస్తుందన్నారు. టి ఎమ్సెట్-2ను లీకైనందువల్ల రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడానికి హైకోర్టు నిరాకరించింది. తాజాగా ఎమ్సెట్-3ను నిర్వహిస్తామని ప్రభుత్వ అదనపు ఏజి జె రామచంద్రరావుకోర్టుకు తెలిపారు. దీని వల్ల ప్రభుత్వాన్ని ఆదేశించలేమనిహైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే తాజాగా ఎమ్సెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినందు వల్ల కోర్టు ఆదేశాలు అనవసరమని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా అదనపు ఏజి జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ సిఐడి దర్యాప్తులో ఎమ్సెట్-2 లీకైనట్లు నిర్ధారణ అయిందన్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక కేసు వివరాలను కోర్టుకు తెలిపారు. మధ్యాహ్నం కోర్టు సమావేశమైనప్పుడు ఈ కేసు విచారణ మళ్లీ చేపట్టింది. తాజా నోటిఫికేషన్‌ను సాయంత్రం ప్రభుత్వం జారీ చేస్తుందని అదనపు ఏజి కోర్టుకు తెలిపారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.