తెలంగాణ

సెర్ఫ్ ఉద్యోగుల వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ఫ్ సిఇఓ పౌసమిబసుతో వేతనాల పెంపుపై క్యాంపు కార్యాలయం మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. సెర్ఫ్‌లో 4174 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్స్‌గా పని చేస్తున్నారు. క్లస్టర్ కోఆర్డినేటర్ల వేతనం ప్రస్తుతం రూ. 6150 ఉండగా ఇక నుంచి రూ.12 వేలకు పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మిగతా ఉద్యోగుల వేతనాన్ని 30 శాతం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పది వేల మంది పని చేస్తున్నారు. వీరిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా 6,982 మంది పని చేస్తుండగా వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రూ.6,290 కాగా ఇక నుంచి రూ.10 వేలకు పెంచాలని సిఎం ఆదేశించారు. మిగతా ఉద్యోగుల వేతనాన్ని 20 శాతం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేతనాల పెంపుదలపై ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు.

13 మంది లాయర్లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ఆగస్టు 2: రంగారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది న్యాయవాదుల ఇటీవల ఆందోళన సందర్భంగా కోర్టు విధులకు ఆటంకం కలిగించాలనే అభియోగాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు పరిపాలన కమిటీ సమావేశమై వరంగల్ జిల్లాలో 11 మంది, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు న్యాయవాదులు కోర్టు విధులకు ఆటంకం కలిగించారని, వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి పరిపాలన కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. అనంతరం సుమోటో కింద నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్, అంబటి శ్రీనివాస్, అల్లం నాగరాజు, బి జయకర్, ఎం సహోదర్ రెడ్డి, వి శ్యాం కృష్ణ, చిల్లా రాజేంద్రప్రసాద్, టివి రమణ, తీగెల జీవన్ గౌడ్, అఖిల్ పాషాకు, రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి రవీందర్, భార్గవ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు గౌరవాన్ని మంటగలపడమేకాకుండా, న్యాయాధికారులను వ్యక్తిగతంగా దూషించారనే అభియోగాలు న్యాయవాదులపై వచ్చాయి. ఈ మొత్తం కేసు విచారణను ధర్మాసనం చేపట్టింది. వీరిపై కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది.