తెలంగాణ

తెలుగు విద్యార్థులకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించిన ఉదంతంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయ జరిగేలా చూడాలని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కె తారకరామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు మంత్రి కెటిఆర్ బుధవారం లేఖ రాశారు. తెలుగు విద్యార్థులను వెనకిక పంపించడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని మంత్రి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం జారీ చేసిన వీసా, అనుమతి పత్రాలన్నీ ఉన్నప్పటికీ తెలంగాణ విద్యార్థులకు అన్యాయంట జరిగిందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. అమెరికాలో చదువుకోవడానికి విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించడంతో వారి కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర మానసిక, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని మంత్రి ఆవేదన వ్యక్త చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వెంటనే అమెరికా ప్రభుత్వంతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ అంశంపై చర్చించడానికి స్వయంగా కలువనున్నట్టు సుష్మాస్వరాజ్‌కు రాసిన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.