తెలంగాణ

తెలంగాణలో పసుపు బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు4: తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంపీ కవిత వెల్లడించారు. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని ఆమె కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పసుపుబోర్డు కోసం ఎంతోకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీనిపై తాను ఇంతకు ముందే కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఉన్నతాధికారులతోనూ పలు దఫాలుగా చర్చించినట్టు కవిత వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీను కలిసినట్టు ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నట్టు ఎంపీ తెలిపారు. ప్రధాని పర్యటన వల్ల పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలు పరిష్కరమవుతాయన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.

చిత్రం.. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలుసుకొని తెలంగాణలో పసుపు రైతుల డిమాండ్ గురించి వివరించిన తెరాస లోక్‌సభ సభ్యురాలు కవిత.