తెలంగాణ

పరిశోధనా రంగానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నాచారం, ఆగస్టు 5: ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధనా రంగానికి పెద్దపీట వేస్తూ శతాబ్ది ఉత్సవాలతో ప్రపంచఖ్యాతిని అర్జిస్తామని వైస్ చాన్స్‌లర్ వి రామచంద్రం అన్నారు. వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన సందర్భంగా శుక్రవారం పరిపాలనా భవనం ఐసిఐసిఆర్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. పరిశోధనా రంగాల్లో విద్యార్థులకు అధ్యాపకులు సహాయ సహకారాలు అందిస్తూనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఓయు శతాబ్ది వేడుకలకు ప్రపంచస్థాయిలో ఆకర్షించేలా నిర్వహించి పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందజేస్తామని పేర్కొన్నారు. ఓయు నాన్ బోర్డర్ విద్యార్థులు వెంటనే హాస్టల్ భవనాలు ఖాళీ చేసి నూతన విద్యార్థులకు స్వాగతం పలకాలని సూచించారు. ఓయు 2017 నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విద్యాప్రమాణాలకు దగ్గరగా రూపొందించినట్టు చెప్పారు. ఓయులో 10 కోట్ల వ్యయంతో నూతన భవనాల నిర్మాణం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. పాత భవనాలకు మరమ్మతులు చేయడానికి అధికారులు పురాతన హాస్టళ్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

నేడు హైదరాబాద్‌కు సుప్రీం చీఫ్ జస్టిస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: శనివారం జరిగే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 14వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ పాల్గొంటారని నల్సార్ వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమంలో 536 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు.