తెలంగాణ

గుండెపోటుతో మాజీ మంత్రి కోనేరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు నాగేశ్వరరావు (79) గుండెపోటుతో శుక్రవారం ఉదయం తన స్వగృహంలో కన్నుమూశారు. మూడుసార్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనేరు నాగేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రంలో చిన్నతరహా నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. కోనేరు మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీలు పువ్వాడ నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్: కోనేరు నాగేశ్వర్‌రావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. కోనేరు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోనేరు నాగేశ్వర్‌రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సిఎం ఆదేశించారు.

భద్రాచలంలో పుష్కర సందడి
భద్రాచలం, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు శుక్రవారం భక్తులతో సందడిగా కనిపించాయి. అంత్యపుష్కరాల్లో ఆరవ రోజు, శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో తీరం రద్దీగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. పుష్కర స్నానాలు ఆచరించారు. తర్పణాలు వదిలి పిండప్రదానాలు చేశారు. అనంతరం పునర్వసు మంటపంలో ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులను దర్శనం చేసుకున్నారు. తొలి శుక్రవారం కావడంతో రామాలయంలో లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేశారు. ఆండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భద్రుని కోవెలలో రామపాదుకలకు అభిషేకం నిర్వహించారు.