తెలంగాణ

ప్రధాని మోదీ రాకతో బలపడనున్న బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఆగస్ట్ 5 : ప్రధాని నరేంద్రమోదీ పర్యటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబందాలు బలోపేతమై బంగా రు తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు పడతాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ మిషన్ భగీరథతో 28వేల పల్లెలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుండడం అద్భుతమైన కార్యక్రమమని ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌ను ప్రశంసిస్తూ దేశంలోనే ఆదర్శమైన పథకంగా అభివర్ణించినట్లు తెలిపారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకొని అమలుచేసేందుకు సిద్ధమవుతుండడంతో తెలంగాణ ప్రజలకు ఆ క్రెడిట్ దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారి ప్రధాని అధికారిక పర్యటన చేస్తుండగా ఘన స్వాగ తం పలకాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని చెప్పా రు. కాగా ప్రధాని నరేంద్రమోదీ కోమటిబండ కేంద్రంగా ఈ నెల 7వ తేదీన మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించడంతోపాటు తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తారని, 12వందల మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ పాయింట్‌ను జాతికి అంకితం చేస్తామని అలాగే మరో 16వందల మెగావాట్ల పవర్ పాయింట్‌కు, కాలోజీ ఆరోగ్య యూనివర్సిటీకి, హైదరాబాద్ - గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ రైల్వేలైన్‌కు శ్రీకారం చుడతారని, రామగుండం ఫర్టిలైజర్ - ఎరువుల కర్మాగార యూనిట్‌కు తిరిగి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మొదటగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాగతోపన్యాసం చేస్తారని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రసంగించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకొని 3వేదికలు ఏర్పాటు చేస్తుండగా మొదటి వేదికపై ప్రధానితో పాటు 18మంది ముఖ్యులు కూర్చుంటారని, సభావేదికకు ఎడమ వైపున ఉన్న మరో వేదికపై కేంద్రమంత్రులు, అధికారులు, కుడివైపు ఉన్న వేదికపై పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్‌లకు కేటాయించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి రాకకోసం మూడు హెలిప్యాడ్‌లు ఏర్పాటుచేయగా, శుక్రవారం ట్రయల్న్ నిర్వహించినట్లు తెలిపారు. 2 లక్షల మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి రేయిన్ ప్రూఫ్ షెడ్‌లు ఏర్పాటుచేయగా, 170 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్, 4వేల బస్సు లు అందుబాటులో ఉంచి జన సమీకరణపై దృష్టి సారించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, నేతలు ఎర్రొల్ల శ్రీనివాస్, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, ఆకుల దేవేందర్‌లు పాల్గొన్నారు.

కోమటిబండ వద్ద సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు