తెలంగాణ

పోడు భూముల్లో హరితహారం!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం ఒడ్డుగూడెంలో శుక్రవారం పోలీసుల సాయంతో ఫారెస్టు అధికారులు దాదాపు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి అందులో హరితహారం పేరుతో మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఫారెస్టు బలగాలు మోహరించడంతో ఒడ్డుగూడెం వణికిపోయింది. ముందుగానే రైతులను భయపెట్టిన అధికారులు, అడ్డుకోవడానికి వచ్చిన రైతు సంఘాల నేతలు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. పది ట్రాక్టర్లతో సుమారు యాభై ఎకరాలు మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు. పోలీసుల రక్షణతో రైతులను, ఎన్డీ నాయకులను అడ్డుకున్నారు. కొంతసేపు ఘర్షణ పడటంతో చింత భద్రమ్మ, పూనెం భద్రమ్మ, పూనెం కోటమ్మ, జర్పుల విజయ, భూక్యా భిక్షం, చింతా లక్ష్మయ్య, లింగ్యాలను జీపులో ఎక్కించుకొని వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ఒకవైపు పంటలు ధ్వంసం చేస్తూనే మరోవైపు హరితహారంలో భాగంగా జామాయల్ మొక్కలను పది హెక్టార్లలో నాటారు. కొప్పురాయి బీట్‌లో ఒడ్డుగూడెంలోని కంపార్టుమెంటు నెంబరు 30లో 200 హెక్టార్ల భూమి ఉం ది. అందులో 125 ఎకరాల భూమిలో హరిత హారం మొక్కలను వేయడానికి రంగం సిద్ధం చేశారు.

మొక్కజొన్న పైరును ధ్వంసం చేస్తున్న దృశ్యం