తెలంగాణ

రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే జాగృతి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 5: తెలంగాణ జాగృతి బహుముఖ లక్ష్య సాధనలో స్వరాష్ట్ర సాధన తొలి అడుగు మాత్రమేనని, రాష్ట్రాన్ని దేశంలో అన్నింటా అగ్రగామిగా నిలపడమే జాగృతి అంతిమ లక్ష్యమని సంస్థ అధ్యక్షురాలు, నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నల్లగొండలో ప్రారంభమైన రెండు రోజుల తెలంగాణ జాగృతి 10వ వార్షికోత్సవ రాష్ట్ర ప్రతినిధుల సభలను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. 2006లో అప్పటి పదవులకు రాజీనామా చేసి కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఆరంభించగా, ఉద్యోగులు ఇంకోవైపు, కవులు, కళాకారులు మరోవైపు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో రాజకీయ పార్టీలు దృష్టిసారించలేని సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ జాగృతిని స్థాపించామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసలను సినిమాల్లో, ఐటి రంగాల్లో అవహేళన చేస్తున్న వైఖరులను తిప్పికొట్టడంతో పాటు మరుగున పడిన తెలంగాణ చరిత్ర, పండుగలు, సంస్కృతుల పునరుజ్జీవనానికి జాగృతి చేసిన కృషి ఫలించి పదేళ్లలో తెలంగాణ యాస, భాష, సంస్కృతి, పండుగలకు గౌరవప్రదమైన స్థానం దక్కిందన్నారు. జాగృతి తొలినాళ్లలో తెలంగాణ యువత, మహిళ, వైద్య రంగాల ప్రగతిని కాంక్షిస్తూ మూడు విభాగాలు ఏర్పాటుచేసి నేడు వివిధ వర్గాల సంక్షేమానికి పది విభాగాలకు చేరిందన్నారు. సమైక్య పాలకుల విధానాలతో చితికి ఆత్మహత్యల పాలైన 389మంది రైతు కుటుంబాలకు రైతు జాగృతి ద్వారా నెలకు 2,500 చొప్పున ఆర్థిక సహాయం జాగృతి నిర్విఘ్నంగా అందించి అండగా నిలబడిందన్నారు. కళలు, సంస్కృతి, సాహిత్య రంగాల ప్రగతికి జాగృతి విభాగాల కృషి కొనసాగుతుందన్నారు. మహిళా సాధికారిక సాధనకు అన్ని రంగాల్లో 33 శాతం భాగస్వామ్యం సాధించేలా జాగృతి కృషి కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ యువత ఉపాధికి రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి ఇప్పటికే 3,500మందికి ఉపాధి శిక్షణ అందించి 1700మందికి ఉద్యోగాలు సైతం కల్పించాలన్నారు. జాగృతి సభ్యులు గ్రామీణ యువతను ఈ సెంటర్లలో చేర్పించి ఉపాధి కల్పనను విస్తృతం చేయాలన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణ గమ్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రతినిధుల సభలు సరైన గమనం నిర్ధేశిస్తాయని ఇందుకు ప్రతినిధులంతా తమ సూచనలందించాలని కోరారు. ఈ సమావేశంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజీవ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.