తెలంగాణ

కృష్ణమ్మ ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 5: ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్నామని చెబుతుండగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం రేవులపల్లి పుష్కరఘాట్ వద్ద కొట్టొచ్చినట్టు కన్పించింది. రేవులపల్లి గ్రామం కృష్ణానది సమీపంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్ వద్ద భక్తులకు 40 తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేశారు. గత వారం రోజులుగా అధికారుల హడావుడితో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి పనులు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం జూరాలకు 2.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో రేవులపల్లి ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అక్కడ నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. పుష్కరాలు సమీపిస్తున్నాయని అధికారుల హడావుడితో నాణ్యతను పట్టించుకోవడం లేదని, దీంతో పుష్కర పనులు 12 రోజుల పాటు కొనసాగడమే గగనమని పలువురు భక్తులు అంటున్నారు. భక్తుల భద్రతపై దృష్టి సారించాల్సిన అధికార యంత్రాంగం జూరాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, పుష్కరఘాట్లు నిర్మించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కేవలం కొందరు నాయకులను, కార్యకర్తలను సంతృప్తి పర్చేందుకు అదనపు ఘాట్లను ఏర్పాటు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రేవులపల్లి, నెట్టెంపాడు, ఉప్పేరు పుష్కరఘాట్లు ఏమాత్రం భక్తులకు సౌకర్యంగా లేవనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పుష్కరాలకు మరో ఏడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రేవులపల్లి ఘాట్ దగ్గర భక్తులకు కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు కొట్టుకుపోవడంతో మళ్లీ వారికి తాత్కాలికంగా ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతి సంవత్సరం కృష్ణానదికి వరద వచ్చే అవకాశం ఉన్నది. వరద ఏ మేర వస్తుంది. ఎన్ని క్యూసెక్కులు వస్తే ఎంత వరకు వరద వస్తుందనేది అధికారులకు ముందుగానే తెలిసిపోతుంది. పూర్తి స్థాయి వరద వచ్చే ఉధృతి వరకు స్థలం విడిచిపెట్టి పుష్కర ఏర్పాట్లను చేయాలి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగానే ప్రజాధనం కృష్ణార్పణమైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా పుష్కరాలకు వచ్చే భక్తులు కూడా మరిన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

రేవులపల్లి పుష్కర ఘాట్ వద్ద వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న తాత్కాలిక మరుగుదొడ్లు
రేవులపల్లి ఘాట్ పూర్తిగా మునిగిపోయిన దృశ్యం