తెలంగాణ

3జిల్లాల్లోనే అధిక వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా 16శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.
జూన్‌లో 50శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో 3శాతం తక్కువ నమోదైంది. ఆదిలాబాద్‌లో 36శాతం ఎక్కువ వర్షపాతం నమోదుకాగా, వరంగల్‌లో 23శాతం, ఖమ్మంలో 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. మొత్తం 459 మండలాలకు గాను మూడు మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరులో మైనస్ 72శాతం వర్షపాతం, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో మైనస్ 68 శాతం, చందంపేటలో మైనస్ 66శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 73 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 17, నల్లగొండలో 17, రంగారెడ్డిలో 11, మెదక్‌లో 10, హైదరాబాద్‌లో 3, కరీంనగర్‌లో 8, ఖమ్మంలో 4, వరంగల్‌లో 2, నిజామాబాద్ జిల్లాలో ఒక మండలంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 208 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 175 మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షం పడింది.శుక్రవారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈనెల 9 నుంచి 12 వరకు మొత్తం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వేతనాలకోసం
ఓయు టీచర్ల ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: ఉస్మానియా యూనివర్శిటీలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని వర్శిటీ పాలకులు చేతులెత్తేయడంతో వర్శిటీ సిబ్బంది శుక్రవారం నాడు ధర్నా చేశారు. గత కొద్ది నెలలుగా అంతర్గతంగా ఉన్న నిధులను వినియోగించుకుని జీతాలు చెల్లించినా, జూలై నెల వచ్చే సరికి అస్సలు నిధులు లేకుండా పోయాయని వర్శిటీ పాలకులు చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం 57.58 కోట్ల రూపాయిలను విడుదల చేసేందుకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చినా, కేవలం 25 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, మిగిలిన 32.58 కోట్లు విడుదల చేస్తే తప్ప సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఉస్మానియా యూనివర్శిటీ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడు బి సత్యనారాయణ పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటర్ బోర్డుకు అవార్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్ధుల సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నందుకు డిజిటల్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో శుక్రవారం నాడు జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఐదు దేశాల యూనివర్శిటీలు, బోర్డుల ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు జార్ఖాండ్ సిఎం ఈ అవార్డును అందజేశారు.
ప్రొఫెసర్ ఎస్వీకి సత్కారం
తెలుగు యూనివర్శిటీ విసిగా నియమితులైన ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను తెలంగాణ పిఎస్‌సి చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి సత్కరించారు. కమిషన్ కార్యాలయంలో సభ్యులు డాక్టర్ మతీనుద్దీన్, టి వివేక్, మంగారి రాజేందర్, ప్రొఫెసర్ సిహెచ్ శైలు, బి మన్మధరెడ్డి, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ రాములు ఈ సత్కార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలకు సరైన గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.
ఐఐటిసిలో నేడు సైన్స్ సమ్మేళనం
హైదరాబాద్ ఐఐసిటిలో శనివారం జరిగే సైన్స్ సమ్మేళనంలో ముగ్గురు ప్రసిద్ధ శాస్తవ్రేత్తలు ప్రసంగించనున్నారు.సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, ఐఎండి హెడ్ డాక్టర్ వై కరుణాకర్‌రెడ్డి, డిఏంఆర్‌ఎల్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ తపస్ కుమార్ నాండీ వివిధ అంశాలపై మాట్లాడతారు.

వివాదాస్పదమవుతున్న
కొత్త విసిల నిర్ణయాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో ఇటీవల 8 విశ్వవిద్యాలయాలకు నియమితులైన వైస్ ఛాన్సలర్లు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. వైస్ ఛాన్సలర్ల నియామకాలు ఎట్టిపరిస్థితుల్లో చెల్లవని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిన దరిమిలా వారి కొనసాగింపు అనుమానాస్పదంగా ఉన్నపుడు కీలక నిర్ణయాలను వారు ఎలా తీసుకుంటారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. కొందరు కొత్త విసిలపై అర్హతలకు సంబంధించి, నడవడికకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చినా, ప్రభుత్వం వెనుకాడకుండా విసిలుగా నియమించడం వివాదాస్పదం అవుతోంది. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించిన విసిలు గత రెండురోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశ్నార్ధకమవుతున్నాయి. విసిల నియామకాలను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అయితే సుప్రీంకోర్టులో ఎలాంటి ఉత్తర్వులు వెలువడుతాయో తెలియకున్నా ప్రస్తుత విసిలు కీలక నిర్ణయాలు తీసుకుంటే, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాజీనామా చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల వ్యవధిలో విసిలు ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలనూ జారీ చేయలేదు.కొన్ని వర్గాల్లో అర్హులైన అభ్యర్థులు లేరని, అందుకే అర్హతలను కుదించామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ఎస్సీలలో అర్హులు లేరని పేర్కొంది. సామాజిక శాస్త్రాల్లో అత్యంత అరుదైన పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ వి కృష్ణ వంటి వారు అందుబాటులో ఉన్నా, అతని అభ్యర్ధిత్వాన్ని రాష్ట్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా, లేరని చెప్పడం కూడా సాంకేతికంగా పెద్ద తప్పిదమని చెబుతున్నారు. యుజిసి నిబంధనలను అనుసరించాలని రాష్ట్రప్రభుత్వం భావించిన పక్షంలో ఛాన్సలర్‌గా గవర్నర్‌నే కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇచ్చిన విసిల నియామక ఉత్తర్వులు దాంతో రద్దవుతాయనేది నిస్సందేహం. ప్రస్తుతం నియమించిన వారినే మరోమారు ప్రభుత్వం పునర్నియామకం చేయాలనుకున్నా ఈసారి గవర్నర్‌కు ఫైళ్లను పంపించాల్సి వస్తుంది, అదే జరిగితే కొంత మంది విసిలపై ఉన్న కేసుల వ్యవహారం తిరగదోడక తప్పదని అంటున్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు కొంత మంది పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసినా, వారిపై ఉన్న కేసుల విషయం గవర్నర్ ఆరా తీయడంతో వారి నియామకాలకు ఫుల్‌స్టాప్ పడింది.