తెలంగాణ

ప్రతి చుక్కకూ పక్కా లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ జల వనరులకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రజల ముందుంచడానికే ఇస్రోతో అవగాహన కుదుర్చుకున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. తెలంగాణ జల వనరుల సమాచారం క్రోడీకరణకు ఒప్పందం ఉపయుక్తమన్నారు. శనివారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రోల మధ్య ఒప్పందం కుదిరింది. స్పేస్ టెక్నాలజీ ఉపయోగించుకుని జల వనరుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్న తొలి రాష్ట్రంగా తెలంగాణకు ఖ్యాతి దక్కిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో చొరవ చూపినందుకు తెలంగాణను అభినందించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడానికి జరుగుతున్న మహత్తర ప్రయత్నంలో జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుకు ఇస్రోతో నీటిపారుదల శాఖ ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఇక రాష్ట్ర జలవనరులకు సంబంధించిన సమస్త, సమగ్ర సమాచారం అరచేతిలో ఉంటుందన్నారు. ప్రతి శాఖలో సుపరిపాలన, పారదర్శకత, జవాబుదారి తనం రావడానికి ఆధునిక సాంకేతిక నైపుణ్యం వినియోగించుకోవాలని సిఎం కెసిఆర్ ఎప్పుడూ చెబుతుంటారని హరీశ్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే గూగుల్ మ్యాప్‌లు, లైడార్ సర్వేల ద్వారా ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక వెబ్ పోర్టల్ భువన్ వేదికగా ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఉపయోగించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టులు సహా జలాశయాల్లో నీటి నిల్వలు, సర్వే నంబర్లు, పంటల వివరాలు తెలుసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ప్రాజెక్టు ఏడాదిలో పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలోని తెలంగాణ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, కాడా కమిషనర్ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.