తెలంగాణ

గుడుంబా బతుకులొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 6: గుడుంబాపై ఆధారపడి బ్రతుకుతున్న వారు ప్రస్తుతం వాటిని విడనాడి గౌరవప్రద జీవితం గడుపుతున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు జిల్లాకు ఐదు కోట్ల రూపాయలను మంజూరి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుడుంబా నిర్మూలనపై స్వయంసంఘాలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడారు. గుడుంబా రాక్షసిపై యుద్ధం చేస్తున్న మహిళలకు అభినందనలు తెలుపుతూ మంచి పని చేసేటప్పుడు ఎగతాళి చేసేవారు ఉంటారన్నారు. అలాంటి వాటికి భయపడొద్దు - తొందరపడొద్దు అంటూ దానికి ప్రత్యక్ష ఉదాహరణ తానేనని అన్నారు. ఈ పని ఆడవాళ్లు చేయాలి, ఈ పని మగవారు మాత్రమే చేయాలన్న ఒక చెడు అలవాటు మనదేశంలోనే ఉందని, ఆడవాళ్లు ఆర్థిక నియంత్రణలోను, కుటుంబ అభివృద్ధికి తద్వారా రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు పలు ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామం అని అన్నారు. వరంగల్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు ఆ గ్రామాన్ని చూపించాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. ప్రభుత్వపరంగా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా గుడుంబా వలన తీవ్ర నష్టం జరిగి ఆ పథకాల ఫలితాలు కనుమరుగవుతున్నాయన్నారు. గుడుంబాను విడనాడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన, గుడుంబా నిర్మూలనకు కృషి చేసే వారికి ప్రోత్సాహకాలు, సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు పదోన్నతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా గుడుంబా నిర్మూలనకు సహకరిస్తున్న ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆయన అభినందించారు. ఆయా శాఖలలో గుడుంబా నిర్మూలనపై వారి వివరాలను రహస్య నివేదికలు పంపిస్తే అవి పదోన్నతుల విషయంలో తగు ప్రోత్సాహకం చూపిస్తామన్నారు. మంచి పని చేసేవాళ్లకు ప్రోత్సాహకం అందిస్తే అవి మంచి మార్గం ఏర్పడడానికి దోహదపడుతుందని తెలుపుతూ తాను సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహించినప్పటి విషయాన్ని వివరించారు. అదే విధంగా ఇళ్ల బయట చెట్లు పెంచే వారిని పిలిచి వాటికి కూడా నీరు పోయాలని సూచించానని ఆరు నెలల తరువాత అలా ఎవరు చేస్తున్నారో రహస్యంగా నివేదిక తెప్పించుకొని ఒక మంచి రోజున వారి ఇంటికి స్వయంగా వెళ్లి ఆ పని చేస్తున్న వారికి నగదు, పట్టువస్త్రాలు అందించానన్నారు. జీవిత కాలంలో 30 నుండి 40 సంవత్సరాలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటారని ఆ కాలంలోనే మంచి పనులు చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలు పుట్టుకకు మూలమైన ఆచార్య యూనిస్‌ను ఇప్పటి వరకు గుర్తుంచుకోవడం ఆయన రూపొందించిన మంచి పనేనన్నారు. అంతకుముందు కొంతమంది మహిళలు ముఖ్యమంత్రికి గుడుంబా నిర్మూలనలో తమ అనుభవాలను వివరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ స్వాగతోపన్యాసం ఇస్తూ జిల్లాలో ఆరు నెలల క్రితం మహిళలు ఆవేదనతో ఉన్నారని ప్రస్తుతం గుడుంబాపై విజయం సాధించి సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో 95 శాతం గుడుంబాను నిర్మూలించినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు రూ.9కోట్ల 20లక్షల 93వేల 311 వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, జిల్లా పరిషత్ చైర్మన్ జి.పద్మ, శాసనసభ్యులు సురేఖ, సిఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, వరంగల్ రేంజ్ డిఐజి మల్లారెడ్డి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, మెప్మా పిడి పురుషోత్తం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
chitram..
గుడుంబా నిర్మూలనపై స్వయం సంఘాల మహిళలు, అధికారులతో బుధవారం వరంగల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్