తెలంగాణ

నిఘా నీడలో నయాం నివాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 10: గ్యాంగ్‌స్టర్ నరుూం తలదాచుకున్న ఇల్లు పోలీసుల నిఘా నేత్రంలో ఉంది. అటువైపు ఎవరు వచ్చినా వారి నుండి పూర్తి సమాచారం సేకరించిన తరువాతే అటువైపు అనుమతిస్తున్నారు. అనుమానం వస్తే పూర్తి స్థాయిలో విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నయాం ఇంటిలో పూర్తి స్థాయి సోదాలు నిర్వహించి ఇంటిని సీజ్ చేసి పోలీసుల తమ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇంట్లో ఉన్న ఒక స్కూటి, రెండు కార్లు ఎవరివి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వాహనాలు రికార్డులలో ఎవరి పేర ఉన్నాయి.. వారికి నరుూంకు గల సంబంధాలు ఏమిటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎపి 28డిఎక్స్3558, ఎపి28సిడి0004 అనే నంబర్లు గల కార్లను, స్కూటీని సీజ్ చేసి క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నరుూం ఇంటికి ప్రతిరోజు అన్ని దినపత్రికలను తెప్పించుకునే వారని చెబుతున్నారు. నయాం ఇంటి పరిసరల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. పట్టణ సమీపంలోని మిలీనియం టౌన్‌షిప్‌లోని ఇంటి నుండే నయాం ఏడాదిన్నరగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
అనుచరులపై పోలీసుల దృష్టి
నరుూం ముఠాలో లెక్కకందని అనుచరులు ఉన్నందున అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. షాద్‌నగర్ పట్టణంలో కూడా నరుూం నివాసం ఉన్న ఇంటి నుండి కొంతమందిని ఆధీనంలోకి తీసుకుని వివరాలను ప్రశ్నిస్తున్నారు. నరుూంకు ఈ ప్రాంతంలో ఎవరెవరు సహకరించేవారని, ఈ ప్రాంతాలలో బెదిరింపులు, కబ్జాలకు పాల్పడ్డాడా లేదా అనే విషయాలను సమాచారం సేకరిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని వైపులా నుండి ఇంటలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తున్నారు.
భయం గుప్పిట్లో మిలీనియం టౌన్‌షిప్
షాద్‌నగర్ రూరల్: ఎన్‌కౌంటర్‌లో నరుూం హతం కావడంతో మిలీనియం టౌన్‌షిప్ ప్రజల్లో ఒక్కసారిగా భయం ఆవహించింది. రెండు రోజులు గడుస్తున్నప్పటికి మిలీనియం టౌన్‌షిప్ ప్రజల్లో భయం వీడకపోవడం గమనార్హం. ఏ క్షణం ఎవరు వస్తారో.. ఎక్కడి నుండి దాడులు నిర్వహిస్తారోనని కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వేలదీస్తున్నారు. మిలీనియం టౌన్‌షిప్‌లోని కాలనీలో నివసించే ఒక కుటుంబంతో నయాం కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
మిలీనియం టౌన్‌షిప్‌కు వచ్చి నప్పుడల్లా ఆ కుటుంబంతో కాలక్షేపం చేసి వెళ్లేవారని సమాచారం. టౌన్‌షిప్‌లో 15నుండి 20కుటుంబాలు మా త్రమే ఉంటాయని, వాటిలోనే ఒక కుటుంబంతో నయాంకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. కాగా, నరుూం ఎన్‌కౌంటర్ అయిన స్థలాన్ని చూసేందుకు షాద్‌నగర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. నరుూం ఎవరు.. ఈ ప్రాంతంలో ఇల్లు ఎప్పు డు కొనుగోలు చేశాడు.. ఎక్కడి నుండి ఇక్కడు వచ్చాడు అనే విషయాలపై ప్రజల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

షాద్‌నగర్‌లో గ్యాంగ్‌స్టర్ నరుూం ఇంటిని సీజ్ చేస్తున్న పోలీసులు.