తెలంగాణ

వచ్చే ఏటినుంచి ఉచిత విద్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జూనియర్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుండి ఉచిత విద్యను అమలుచేయాలని నిర్ణయించింది. ఎల్‌కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందిస్తామనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ విద్యారంగంలో తొలి మెట్టుగా ప్రభుత్వం ఇంటర్మీడియట్ కాలేజీల్లో అందరికీ ఉచితంగా విద్యను అందించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 402 జూనియర్ కాలేజీలున్నాయి. 2014-15 విద్యాసంవత్సరంలో 1,15,111 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివారు.
మరో నాలుగు లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరిన 1.15 లక్షల మందిలో 80 శాతానికి పైగా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు చెందిన వారే. వారందరూ కాలేల్లో చేరినపుడు కొంత ఫీజు చెల్లించి చేరుతున్నారు. తర్వాత వారికి ఆ మొత్తానికి రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. విద్యార్థులు చెల్లించడం, తర్వాత వారు దరఖాస్తు చేసుకోవడం, వాటిని అధ్యయనం చేసి వారికి తిరిగి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం వంటి కార్యకలాపాలతో సిబ్బంది మొత్తం ఆ పనుల్లో నిమగ్నం కావల్సి వస్తోంది. ఈ వ్యవహారంపై కమిషనర్ ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఫీజుల చెల్లింపు, రీయింబర్స్‌మెంట్ విషయాలను అధ్యయనం చేసింది. విద్యార్థుల నుండి 893 రూపాయలను స్పెషల్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అందులో 180 రూపాయలు ల్యాబ్ డిపాజిట్‌గానూ, 60 రూపాయలు లైబ్రరీ డిపాజిట్‌గానూ వసూలు చేస్తున్నారు.
ఇవన్నీ తిరిగి విద్యార్థికి తమ చదువు పూర్తయిన తర్వాత ఇస్తున్నారు. 85 రూపాయలు రికగ్నైజేషన్ ఫీజు, 5 రూపాయలు అడ్మిషన్ ఫీజుగా, మరో 3 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలుచేస్తారు. ఇంతా చేస్తే ప్రభుత్వం మరో పక్క ఇచ్చేది ఇస్తూనే ఉంది. విద్యార్థులు చెల్లించే డబ్బు కంటే వాస్తవంగా ప్రభుత్వమే ఎక్కువగా చెల్లిస్తోంది. ఇంత హడావుడి చేసి చివరికి విద్యార్థుల డబ్బులు వారికే ఇచ్చేందుకు ఇంత శ్రమ ఎందుకని భావించిన ప్రభుత్వం అందరికీ ఉచితంగా విద్య అందిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.