తెలంగాణ

ఇంటికొకరు డిజిటల్ అక్షరాస్యులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఆగస్టు 17: గ్రామీణులకు ఇన్మర్మేషన్ టెక్నాలజీ (ఐటి)ని అందుబాటులోకి తెస్తామని, ఇంటికొకరు డిజిటల్ అక్షరాస్యులుగా తయారుకావాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కెటిఆర్) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో తెలెఖా నెట్ వర్కింగ్ టెక్నాలజీ పేరుతో ఏర్పాటైన ఐటి స్టార్టప్ కంపెనీని ఐటి మంత్రి కెటిఆర్ బుధవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపిలు కెప్టెన్ వొడితెల లక్ష్మికాంతరావు, బాల్క సుమన్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటి పరిశ్రమ పురోగతి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని అన్నారు. తద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. టి హబ్ పేరుతో కొత్త కంపెనీలను, ఔత్సాహికులను, చిన్న పెట్టుదారులను, నిపుణులను తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వారికి కావల్సిన టెక్నాలజీని, ఆర్థిక వనరులను, వౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువ ఇంజనీర్లలో నైపుణ్యం పెంపొందించేందుక టాస్క్ ఏర్పాటు చేశామని వివరించారు. రెండేళ్లలో టిఎస్ ఐపాస్ పేరుతో కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు కావలసిన అనుమతులు సత్వరమే పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో పాటు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఐటి కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌కు రావడం హర్షనీయమన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటి అభివృద్ధిపై దృష్టిపెట్టామని, ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తే వారికి సహకరిస్తామని, వౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చిన విధంగానే ఇంటింటికి బ్రాడ్ బ్యాండ్ ఇచ్చేందుకు భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా వేస్తున్నామని తెలిపారు. లక్ష ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆకాంక్ష కూడా త్వరలో నెరవేరుతుందని, ఇప్పటికే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఉద్యోగాల భర్తీ ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఐటి అంటేనే కెటిఆర్, కెటిఆర్ అంటేనే ఐటి అని చమత్కరించారు.

చిత్రం.. హుజూరాబాద్‌లో ఐటి స్టార్టప్ కంపెనీని ప్రారంభిస్తున్న ఐటి మంత్రి కెటి రామారావు