తెలంగాణ

ఐదవ శక్తి పీఠానికి భక్తుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 17: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదవశక్తి పీఠానికి అంచనాలకు మించి భక్తుల తాకిడి ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఆరవ రోజు సైతం భక్తుల రద్ది మరింత పెరిగింది. అధికారులు వేసుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ కృష్ణా పుష్కరాల్లో జోగులాంబ (గొందిమళ్ల) పుష్కర ఘాట్లలో లక్ష మందికిపైగా ప్రతిరోజు పుణ్యస్నానం చేసి ఐదవశక్తి పీఠం జోగులాంబదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే శ్రీ బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్ది మరింత పెరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఐజి శ్రీనివాస్‌రెడ్డితో పాటు డిఐజి అకున్‌సబర్వాల్, ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం అలంపూర్‌లో పర్యవేక్షిస్తూ రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను అక్కడే మఖాం వేసి భద్రత విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ సైతం అలంపూర్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు. జోగులాంబ ఆలయ ప్రాంగణంతో పాటు పుష్కర ఘాట్లను సందర్శించి భక్తులతో మాట్లాడారు. అలంపూర్ క్షేత్రానికి భక్తుల తాకిడి ఉండడంతో అదనంగా 500 మంది పోలీసులను భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా పంపారు. అడుగడుగున పోలీసు నిఘాతో పాటు ట్రాఫీక్‌కు అంతరాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.