తెలంగాణ

నరుూం బంధువుల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 18: ఈనెల 8న పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నరుూం అత్త, అతని బావమరది, బావమరది భార్యను స్టేట్ ఇనె్వస్టిగేటింగ్ టీం (సిట్) అధికారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఒన్‌టౌ న్ పోలీస్ స్టేషన్‌లో రెండు రోజులుగా విచారణ జరుపుతున్నారు. ఈనెల 9న ఒన్‌టౌన్ పోలీసులు నయాం అత్త సుల్తానాబేగం, బావమరది సయ్యద్ సాదిక్, అతని భార్య ఫర్జానాలను అరెస్టు చేసి స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా వారికి 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. వారి నుండి పోలీసులు సుమారు 240 ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఒక తపంచా, 4 డిటోనేటర్లు, 4.6 లక్షల రూపాయలు నగదు, 72 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారిని హడావుడిగా కోర్టులో హాజరుపర్చారు. అయతే, సెల్‌ఫోన్‌లు, డాక్యుమెంట్ల వివరాలను, బ్యాంక్ లాకర్ల వివరాలను పోలీసులు సేకరించలేదు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా విచారణ పనులను వారు చేపట్టారు.