తెలంగాణ

కిలిమంజారోను అధిరోహించిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ఆఫ్రికాలో అతి ఎత్తయిన పర్వతం కిలిమంజారోను అధిరోహించి తెలంగాణ గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థులు గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. శిక్షకులు శేఖర్‌బాబు, పూర్ణ నేతృత్వంలో 16 మంది విద్యార్థినులు కిలిమంజారోను అధిరోహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మలావత్‌పూర్ణ, పదో తరగతి చదువుతున్న వి పూజ, డి వౌనిక, ఇంటర్ చదువుతున్న బాలరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన టెన్త్ విద్యార్థి ఎన్ కృష్ణ, జి సింధు అధిరోహకుల్లో ఉన్నారు. వౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణ అనుభవాన్ని ఉపయోగించుకుని మిగిలిన విద్యార్థులు ఈ నెల 10న కిలిమంజారో అధిరోహణ కార్యక్రమం చేపట్టారని, 19,341 అడుగులు ఎత్తయిన కిలిమంజారోను 13వ తేదీ రాత్రి అధిరోహించారని సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు.
విద్యార్థులు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల వారేనని, అయినా వారికి అవసరమైన ఊతం ఇస్తే వారు ఏదైనా సాధించగలరని నిరూపించారని ప్రవీణ్‌కుమార్ అన్నారు. రెండు వరుస విజయాలతో గురుకులాల విద్యార్థులు కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రవీణ్‌కుమార్ అందజేసిన సాయం అమోఘమని వారు పేర్కొన్నారు. ఆంగ్లంలో శిక్షణతో పాటు పర్వతారోహణ, క్రీడలలో ప్రావీణ్యం కోసం ఎంతో సహకరిస్తున్నారని, మరో పక్క ప్రామాణిక విద్యను అందించేందుకు తోడ్పడుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సాహసాలు చేసిన విద్యార్థులు చదువుల్లోనూ ముందుంటున్నారని ప్రవీణ్‌కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

చిత్రం.. కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన గురుకుల విద్యార్థులు