తెలంగాణ

ఎకరం రూ.30లక్షలు.. 7లక్షలకే రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఆగస్టు 19: తమకు నచ్చిందంటేచాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బెదిరించైనా పనికానివ్వాల్సిందే... ఇదే గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరుల స్టైల్. రైతులను, వ్యాపారస్థులను చంపుతామని బెదిరించి వారి భూములను తమపేర రిజిస్ట్రేషన్ చేసుకున్న నరుూం బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తూ పోలీస్‌స్టేషన్లలో పిర్యాదు చేస్తున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామం 106 సర్వేనెంబర్‌లో 16.1 ఎకరాల భూమిని చంపుతామని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. పిర్యాదుదారులైన రాసాల నర్సింహ్మ, రాజమ్మ, యాదయ్య, అండాలు, ఎలకొండ వెంకటనర్సింహ్మతోపాటుగా మొత్తం 30 మందికి చెందిన 16.01 ఎకరాల భూమిని నరుూం అనుచరుడైన పాశం శ్రీనివాస్ తమందరినీ చంపుతామని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు 30 లక్షల విలువచేసే భూమిని 29 జనవరి 2007 సంవత్సరంలో 7 లక్షల రూపాయలు విలువచేసే భూమికి కేవలం 7 లక్షలు మాత్రమె చెల్లించి మిగతావి ఇస్తామని నమ్మబలికి రిజిస్ట్రేషన్ కానిచ్చారని వాపోయారు. అనంతరం మిగిలిన డబ్బులు ఇవ్వమని అడగడంతో డబ్బు మాటెత్తితే చంపుతామని బెదిరించినట్లు బాధిత రైతులు వివరించారు. 16.01 ఎకరాల భూమిపై 30 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ఇప్పటికైనా తమ భూమిని తమకు ఇప్పించి న్యాయంచేయాల్సిందిగా పోలీసులను కోరారు. భువనగిరి డివిజన్ పరిధిలో నారుూం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో సిట్ అధికారులు భువనగిరి డివిజన్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి సిట్ ఐపిఎస్ అధికారి నాగిరెడ్డి భువనగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా తుక్కాపురం గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ పోలీసు అధికారులైన శ్రీ్ధర్, సందీప్ చేపట్టిన విచారణలో భాగంగా తుక్కాపురం బాధితుల నుండి వివరాలను తెలుసుకోవడంతోపాటు రికార్డులను పరిశీలించారు.
శుక్రవారం మధ్యాహ్న సమయంలో భువనగిరి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గల డాక్యుమెంట్ రైటర్లు లింగం, భాస్కర్‌కు చెందిన మూడు కంప్యూటర్లను సిట్ పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. నరుూం ముఠాకు సంబందించిన రిజిస్ట్రేషన్లకు సహకరించడంతోపాటు వారికి సంబందించిన సమాచారాన్ని హార్డ్‌డిస్క్‌ల నుండి సేకరించేందుకు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రైతులు. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయంలో సోదాలు చేస్తున్న పోలీసులు

టిఎస్‌పిఎస్‌సికే గురుకుల
పోస్టుల భర్తీ బాధ్యత
సొసైటీ బోర్డు నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ గురుకులాల్లోని పోస్టులను భర్తీ చేసే బాధ్యతను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కే అప్పగించాలని గురుకులాల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించారు. తొలి దశలో 313 పోస్టులను భర్తీ చేయాల్సిందిగా పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు సొసైటీ సూచించింది. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల సొసైటీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించింది. మరో పక్క విద్యార్థులకు యూనిఫారాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, బెడ్డింగ్ మెటీరియల్, ట్రంక్ బాక్స్‌లు, ప్లేట్లు , గ్లాసులు, బూట్లు, సాక్సులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహించగా, 8 మంది సీనియర్ అధికారులు, 8 మంది ఇతర సభ్యులు హాజరయ్యారు.

నజ్మా హెప్తుల్లాకు
డిప్యూటీ సిఎం అభినందనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మణిపూర్ గవర్నర్‌గా నియమితురాలైన మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి నజ్మా హెప్తుల్లాను కలిసి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి నజ్మా హెప్తుల్లాతో శుక్రవారం భేటీ అయ్యారు. నజ్మా హెప్తుల్లా కేంద్ర మంత్రివర్గంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ బడ్జెట్‌లో 50 శాతం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కేంద్రం నుంచి కేటాయించారని, ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగేట్టు చూడాలని కోరారు. విద్య ద్వారానే ముస్లింలలోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించ వచ్చుననే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మైనారిటీల్లో విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. సౌదీ అరేబియాలో పనుల కోసం వెళ్లిన తెలంగాణ వారు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని వట్టి చేతులతో వెనక్కి పంపిస్తున్నారని, దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించేందుకు కృషి చేయాలని నజ్మా హెప్తుల్లాను మహమూద్ అలీ కోరారు.

ఐదుగురు డిఎస్పీల బదిలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని గోపాల్‌పేట్ ఏసిపిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎస్‌డిపివోగా బదిలీ చేశారు. ఆర్మూర్ ఎస్‌డిపివో ఏ రాంరెడ్డిని తెలంగాణ డిజిపి కార్యాలయానికి రిపోర్టుచేయాల్సిందిగా ఆదేశించారు. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్‌బి నగర్ ఏసిపి (ట్రాఫిక్)గా పనిచేస్తున్న ఎం శ్రీ్ధర్ రెడ్డిని ఖమ్మం జిల్లా వైరా ఎస్‌డిపివోగా బదిలీ చేశారు. వైరా ఎస్‌డిపివోగా పనిచేస్తున్న బి రాంరెడ్డిని తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఖమ్మం జిల్లా ఎస్‌బి విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్న బి అశోక్ కుమార్‌ను అదే జిల్లా మణుగూరు ఎస్‌డిపివోగా బదిలీ చేశారు.
ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో
డిజిపిని నివేదిక కోరిన హెచ్‌ఆర్‌సి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 19: మెదక్ జిల్లా కుకునూర్ పల్లి పోలీసుస్టేషన్ ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనను హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది.