తెలంగాణ

డిపిఆర్ లేకుండా టెండర్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ లేకుండానే టెండర్లా? అని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక రోడ్డు వేయాలనుకున్నా, ఒక చిన్న గది నిర్మించాలనుకున్నా డిపిఆర్ ఉంటుందని, అలాంటప్పుడు 83,000 కోట్ల రూపాయలతో చేపట్టే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. నాడు బషీర్‌బాగ్ కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బషీర్‌బాగ్‌లోని స్మారక స్థూపం వద్ద ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు డిపిఆర్ సిద్ధం చేయలేదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే జైల్లో పెడతామంటూ ముఖ్యమంత్రి బెదిరించడం భావ్యం కాదని ఆయన అన్నారు.