తెలంగాణ

అరుదైన శస్తచ్రికిత్సలకు నెలవు ఉస్మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: అరుదైన శస్త్ర చికిత్సలకు ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్లను ఆయన అభినందించారు. అరుదైన ఆపరేషన్స్‌తో ప్రభుత్వ రంగ వైద్య సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నా రు. ఇటీవల రజిత ముక్కును ఆమె భర్త కోయడంతో ఆమె ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నదని, వెంటనే డాక్టర్లు ఆమె ముక్కుకు అరుదైన శస్త్ర చికిత్స చేయడం ఉస్మానియా వైద్యుల సామర్థ్యానికి అద్దం పడుతున్నదని అన్నారు. ప్రైవేటు రంగంలో లక్షల ఖర్చు అయ్యే ఇటువంటి శస్త్ర చికిత్సలను చేస్తున్న ఉస్మానియా వైద్యశాల ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి నాగప్రసాద్, వైద్యులు ప్రవీణ్ హరీశ్, మధుసూదన్ నాయక్, జైపాల్ రాథోడ్, రెహెనా, కృష్ణమూర్తి, గంగా భవాని, నాగేంద్ర ప్రసాద్, పతంజలి, జ్యోతి, పారా మెడికల్, నర్సింగ్, సహాయ బృందాలను మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు.