తెలంగాణ

వర్షాకాల సమావేశాలు 15 రోజులు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు జిఎస్టీ బిల్లుకే పరిమితం చేసి ఒక రోజుతోనే ముగించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోందని, ప్రభుత్వం ఈ అలోచనను మానుకొని సమావేశాలను 15 రోజులు జరపాలని అసెంబ్లీలో సిపిఎం పక్ష నాయకుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా శీతాకాల సమావేశాలు జరపలేదని, ఈ సంవత్సరం వర్షాకాల సమావేశాలు జరపాలనే ఆలోచన ఉన్నట్లు లేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా, ప్రతిపక్షమన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. గడచిన రెండేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచకుండా గత పాలకుల విధానాలనే అమలు చేస్తూ నూటికి 92 శాతంగా ఉన్న సామాజిక వర్గాలను విస్మరిస్తుందని, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని రాజయ్య డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, కనీస వేతనాల అమలు, సంక్షేమ పథకాల అమలు, సబ్‌ప్లాన్ రూల్స్, నరుూం-పోలీస్, రెవెన్యూ అధికారుల ఆగడాలు, పోడు భూములు, ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్వాసితుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం జిఎస్టీ బిల్లు పేరుతో ఒకటి, రెండ్రోజులకే పరిమితం చేయకుండా కనీసం 15 రోజుల పాటు జరపాలని రాజయ్య డిమాండ్ చేశారు.