తెలంగాణ

చెరువులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 29: నల్లగొండ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు జోరందుకున్నాయి. సోమవారం 44 మండలాల్లో 24.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా త్రిపురారంలో 140.8 మిల్లీమీటర్లు, గరిడేపల్లిలో 140.6, వేములపల్లిలో 128.6, దామరచర్లలో 123.6, మిర్యాలగూడలో 112.4, తిప్పర్తిలో 85, నేరేడుచర్లలో 76.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కువగా మిర్యాలగూడ డివిజన్‌లో వర్షాలు పడగా మండలాల్లోని చెరువులు, కుంటలు క్రమంగా నిండుతూ జలకళను సంతరించుకుంటున్నాయి. వేములపల్లి మండలంలో చిత్రపర్క వాగు పొంగడంతో పరివాహక ప్రాంతంలో సేద్యంలో ఉన్న వరి పంటలు నీట మునిగాయి. కుక్కడం చెరువు వాగు వెంట పొలాలు సైతం వరద తాకిడి గురయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలో వరద నీటి ఉధృతికి నాలాలు పొంగగా రోడ్లు జలమయమయ్యాయి. తాజా వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు ప్రయోజనకంగా మారాయి. అటు మూసీ నది ఎగువ ప్రాంతంలో, జంటనగారాల్లో కురిసిన వర్షాలతో మూసీ నది కాలువలకు నీటి విడుదల ప్రారంభించడంతో వాటి పరిధిలోని చెరువులు, కుంటలకు నీరు చేరుతోంది. సాగర్ ఎడమకాలువ ఆయకట్టుకు ఆరుతడి నీటి విడుదల కొనసాగుతోంది.

చిత్రం.. వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద చిత్రపరక బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న నీరు