తెలంగాణ

20నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20నుంచి నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలు పది పని దినాలకు తగ్గకుండా నిర్వహించాలని కూడా ప్రభుత్వం వెల్లడించింది. జిఎస్టీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేకంగా మంగళవారం సమావేశమైంది. బిల్లు ఆమోదం తర్వాత సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అరగంటపాటు వాయిదావేసి తన ఛాంబర్‌లో బిఏసి నిర్వహించారు. సిఎం కె చంద్రశేఖర్‌రావు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, బిజెపి తరఫున డాక్టర్ లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, ఎంఐఎం తరఫున బలాల, సిపిఎం నుంచి సున్నం రాజయ్య హాజరయ్యారు. జిఎస్టీ కోసం ప్రత్యేకంగా సమావేశమైనప్పటికీ, అసెంబ్లీని నాలుగైదు రోజులు కొనసాగించి కరవు, రైతు సమస్యలు, మహారాష్టత్రో ఒప్పందాలు, కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలని విపక్షాలు కోరాయి. దీనిపై సిఎం కెసిఆర్ జోక్యం చేసుకుంటూ నాలుగైదు రోజులు కాదు, సభను పది పనె్నండు రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. మహారాష్టత్రో ఇటీవల ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను చర్చించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, ప్రాజెక్టుల రీ- డిజైనింగ్‌పై ఇప్పటికే సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ, మరికొన్ని అపోహలు విపక్షాలు వ్యక్తం చేస్తుండటంతో వాటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అంశాలపై చర్చకు నాలుగైదు రోజులు సరిపోదని, కనీసం పది పని దినాలైనా సభ నిర్వహించాలని భావిస్తున్నట్టు వివరించారు. అయితే వినాయక చవితి, బక్రీద్ పండుగలు నేపథ్యంలో సభకు బందోబస్తు కల్పించడం కష్టమవుతుందని పోలీసులు చెబుతున్నట్టు వివరించారు. మధ్యలో పండుగలు వచ్చిన నేపథ్యంలో, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 20నుంచి నిర్వహించడం సబబని సిఎం ప్రతిపాదించారు. దీనికి విపక్షాలు అంగీకరించటంతో, 20నుంచి పది పనిదినాల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.