తెలంగాణ

కెసిఆర్‌పై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కెసిఆర్, టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ మార్పిడిపై అవినీతికి పాల్పడ్డారని విచారణ జరిపించాలని కోరుతూ ఫర్హాత్ ఇబ్రహీం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి, పలువురు టిడిపి ఎమ్మెల్యేలపై అవినీతి కేసు నమోదు చేయాలని కింది కోర్టులో ఇబ్రహీం పిటీషన్ దాఖలు చేయగా కొట్టివేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పిటీషన్ దాఖలు చేశారని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సి ప్రవీణ్ కుమార్ పిటీషన్‌ను కొట్టివేశారు.