తెలంగాణ

మద్దతిస్తూనే భిన్నస్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: శాసన సభలో వస్తు సేవల పన్ను బిల్లు(జిఎస్‌టి) బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతిస్తూనే.. దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి.
* జిఎస్‌టి వల్ల దేశంలో బహుళ పన్నుల విధానం పోయి ఒకే దేశం, ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుంది. ఈ బిల్లును తొలుత రూపొందించిన ఘనత కాంగ్రెస్‌ది. కెనెడాలో జిఎస్‌టి బిల్లును ప్రవేశపెట్టి అమలు చేసిన ప్రభుత్వం మరుసటి సంవత్సరం ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. ప్రజలకు ఆగ్రహం తెప్పించే విధంగా పన్నుల విధింపు ఉండరాదు.
-కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి
* పన్నుల సంస్కరణలో ఇది ఒక మైలు రాయి. జిఎస్‌టి బిల్లు వల్ల రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. జిఎస్‌టి వల్ల 17 రకాల పన్నులు ఉండవు. బ్యాంకుల రుణాలు సులభతరమవుతాయి.
-బిజెపి శాసనసభాపక్ష నేత జి కిషన్ రెడ్డి
* కేంద్రం రాష్ట్రాలకు జిఎస్‌టి అమలు వల్ల ఎదురయ్యే నష్టాలను తొలి ఐదు సంవత్సరాలు భరిస్తామన్న హామీని గుడ్డిగా నమ్మరాదు. ఈ విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.
-సిపిఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య
*జిఎస్‌టి బిల్లు వల్ల పన్నుల విధానంలో గందరగోళం తొలుగుతుంది. ఒక దేశం, ఒక పన్ను విధానం వల్ల వినియోగదారులపై అనవసరమైన భారం తగ్గుతుంది. దీని వల్ల వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో పన్నుల చెల్లింపులు సులభతరమవుతాయి.
టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్
* జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వస్తు సేవాపన్నును ఆహ్వానిస్తున్నాం.
-టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
* ఈ పన్ను వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలను వివరించాలి.
-మజ్లిస్ ఎమ్మెల్యే వౌసమ్ ఖాన్