తెలంగాణ

గురుకులాల్లో నిరసన జ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ గురుకులాల ముఖచిత్రం మార్చేందుకు కార్యదర్శి సీనియర్ ఐపిఎస్ అధికారి ఆర్ ప్రవీణ్‌కుమార్ తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై రోజుకూ గురుకుల సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కార్యదర్శి వైఖరిని నిరసిస్తూ రెండు రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన సిబ్బంది 6వ తేదీ నుండి తమ సమస్యలపై కార్యదర్శికి, వైస్ చైర్మన్‌కు ఇ మెయిల్ క్యాంపెయిన్ చేయాలని, 8వ తేదీ నుండి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, మంత్రులకు వినతి పత్రాలు అందించాలని, 10 వ తేదీన భోజన విరామ సమయంలో ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు స్ట్ఫా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ఎన్‌క్యూపి పేరుతో సెమినార్లు, ప్రెజెంటేషన్ల విధానం తొలగించాలని, సిఆర్‌టిఎస్, అడ్‌హక్ టీచర్లను కొనసాగించాలని, అశాస్ర్తియమైన రూల్ 28ఎను తొలగింపు, పిఆర్‌సి 2015 పే స్కేళ్లను మూడు దశల్లో అమలుచేయాలని , ఉద్యోగుల విభజన, ఆరోగ్య కార్డులు జారీ, కొత్త విద్యాసంస్థలకు పదోన్నతులు, రెగ్యులర్ పోస్టుల మంజూరు వంటివి వారి ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
పరస్పర బాహాబాహీ
సిబ్బంది నేరుగా కార్యదర్శిని లక్ష్యంగా చేసుకుని నిరసన వ్యక్తం చేస్తుండగా, కార్యదర్ళి కార్యక్రమాలను సమర్ధిస్తున్న తల్లిదండ్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు సిబ్బందికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు నిర్వహించి కార్యదర్శి కార్యకలాపాలను వారు అభినందించారు.