తెలంగాణ

ఆశ్రమాలను కూల్చి బైపాస్ రోడ్డా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 13: దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కార్యదీక్ష గొప్పదని, దేశంలోనే మరే ముఖ్యమంత్రి ఒక దేవాలయానికి సంవత్సరానికి 100 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత లేదని, అలాంటి ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఈ క్షేత్రం ధర్మం, ఆధ్యాత్మికం, సంస్కృతితో వర్ధిల్లుతుందని కమలానంద భారతీస్వామి అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట బుచ్చిదాస ఆశ్రమంలోని బైపాస్ నిమిత్తం బుచ్చిదాస ఆశ్రమ ప్రహరీని తొలగించడాన్ని ఆయన బుధవారం పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాయగిరి నుండి యాదగిరిగుట్ట రాజగోపురం ముఖద్వారం వద్దకు రోడ్డు ఏదైతే వుందో అది శ్రేష్టమైనదని, బైపాస్ రోడ్డు గుండ్లపల్లి నుండి యాదాద్రి ఘాట్‌రోడ్డు వరకు నైరుతి మీదుగా వెళ్లడం వల్ల యాదాద్రి ఎదుగుదల అంతగా ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. యాదాద్రి మాస్టర్ ప్లాన్‌ను మెదటగా స్థానికులకు విడుదల చేయాలని, ఇక్కడి అన్యకులస్తుల భవనాలను, సత్రాలను కాపాడాలని, యాదాద్రికి లక్షమంది భక్తులు వచ్చిన వసతులకు, పార్కింగ్‌కు, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కింది స్థాయి ఉద్యోగస్తులతోనే అసలు సమస్య అని మెప్పుకోసం ప్రణాళికలు లేకుండా మధ్యలో ఆశ్రమం ఉన్నా బెదిరింపులకు పాల్పడడం, కోట్లాది రూపాయల విలువ కలిగిన ఆశ్రమాన్ని కూల్చి రోడ్డు వేస్తామనడం మంచిదికాదన్నారు. బుచ్చిదాస ఆశ్రమం 60 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, కీర్తనలతో అనునిత్యం వెలుగొందుతోందని, ఈ ఆశ్రమంలో తపఃసిద్ధుల సమాధులు కూడా ఉన్నాయని, వాటిని తొలగించాలని చూస్తే హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర హిందూ పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యుడు రవీందర్‌రెడ్డి, ఆశ్రమ పీఠాధిపతి శంకరానందగిరి స్వామి, బిజెపి జిల్లా నాయకులు రచ్చ శ్రీనివాస్, రచ్చయాదగిరి, బాలేష్, లక్మారెడ్డి, కృష్ణందాసు, సత్తిరెడ్డి, గండయ్య తదితరులు పాల్గొన్నారు.

కూల్చిన ఆశ్రమ ప్రహరీని పరిశీలించిన అనంతరం విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న కమలానంద భారతీస్వామి